పుట:TeluguSasanalu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. అరకట వేముల శాసనము

(8 వ శతాబ్దముది కావచ్చును.)

ప్రొద్దుటూరు తాలూక.

  1. స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య
  2. ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర
  3. విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు
  4. ఇన్నల్వురు సాక్షి
  1. దేనికి వక్రంబువచ్చు వాన్డు(డ్=θ)పఞచ్ మహాపాతక సంయ్యుక్తున్డు(డ్=θ) గున్
  2. అబ్భిద్ధ೯త్తన్త్రిభి భు೯క్తం సద్భిశ్చపరిపాలితం ఏతానినని వత్త೯న్తే పూవ్వ೯రాజకృ
  1. తానిచ ||స్వరత్తా[0]పరదత్తా[0]వాయోహరేతి(త) వసుందరా(0)షష్టిం వష೯సహప్రాణి విష్టా
  2. యాం జాయతే కృమి(ః)

శాసనము చాలా స్పష్టముగ చదువుటకు వీలుగనున్నది.శాసనపాఠము పూర్తిగనే యున్నది.చెప్పదగిన లోపములు కానరావు.సంస్కృతశ్లోకములలో తప్పులు చెప్పదగినవి అంతగా లేవు.కనుక లేఖకుని దోషమని చెప్పి వదలివేయ వలసిన భాగమంతగా లేదు.కాని మనకీశాసనములో అనేక సందేహాలు కనుపించును.

  1. 'పృథివీరాజ్యఞచెయన్ 'అను క్రియకు కర్త కనుపించదు.శ్రీ వల్లభ మహారాజు అనిచెప్పుచో ముందుండవలసిన'మహారాజాధిరాజ... ఇత్యాది బిరుదు పరమందున్నట్లు భావించవలెను.అట్లాకూడ కొన్ని గలవు."స్వస్తిశ్రీ విక్రమాదిత్య ప్రిథివీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర భటరళ్" అని