పుట:TeluguSasanalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

తెలుగుశాసనాలు

దిత్యుడు.'విక్రమాదిత్య' అను పేర్లు వచ్చినప్పుటినుండి వీరు బాదమి చాళుక్యులకు సామాంతులైనత్లు తెలుస్తుంది.బాదామి చాళుక్య రెండవ పులకేశి వల్లభుని(611-643) కొడుకు మొదటి విక్రమాదిత్యుడు క్రీ.678 వరకు రాజ్యమేలెను.తరువాత అతని కొడుకు వినయాదిత్యుడు,ఇతని కొడుకు రెండవ విజయాదిత్యుడు వరుసగా రాజ్యమేలిరి.విజయాదిత్యుని కొడుకు రెండవ విక్రమాదిత్యుడు క్రీ.732 లో రాజయ్యెను.ఇతనికి సమకాలికుడు సత్యాదిత్యుడనే రేనాటి చోళరాజు.ఈ రాజుయొక్క శిలాశాసన మొకటి కమలాపురము తాలూకా మాలెపాడులో కలదు.