పుట:TeluguSasanalu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

తెలుగుశాసనాలు

10.పుష్యంబు బృహస్పతి హోర[కా]

11.ను ఎమ్బది యె చామణకాలధ[11*]

ఇచట దానము చేసినది చామణకాలు అను ఉద్యోగి. కనుక 'పుణ్యకుమారుడు రేనాణ్డేళుచు'- అనుదానికి పుణ్యకుమారుడు రేనాణ్డేళుచుండగా అనిచెప్పవలెను. 'ళ'కారములు కొన్ని యింకా 'ల 'కారములుగ మారలేదు. ఏవ్ళుచున్, అనేయున్నది.వేరే శాసనంలో 'శమ్మ೯ళాకున్' అనికూడా కలదు. 'ఎరికల్' అనుహలంతముపట్టుదలగా 'ఎరికల్ల'అని అజంతంగా మార్చబడింది. ఇదే నిజ మైన తెలుగుతనము. అట్లే ద్రవిడ హలంత తత్సమాలు పుణ్యకుమారన్; గణ్యమానన్, ముదముది తన్, ఉత్తమోత్తమన్, అనేపదాలు ఉకారాంత తెలుగు తత్సమాలుగ మారినవి. పుణ్యకుమారున్డు, గణ్యమానున్డు, మదముదితున్డు, ఉత్తమోత్తమున్డు(ఈ నాలుగు పదాల లోని డ వత్తును θ గా చదువవలెను) అని 'ఉ'కారాంతములు ప్రథమైక వచన రూపము లు తయారై నవి. ఈ చివరి 'ఉ 'కారారము నుచ్చరించుటకు ముందున్న ప్రాతిపదికలోని 'అ 'కారముకూడ 'ఉ' కారము కావలసి వచ్చింది. అనగా చివరి 'ఉ'కారమును నుచ్చరించుటలో కష్టము లేకపోతే ముందున్న ప్రాతిపదికలోని తుది 'అ'కారము 'ఉ'గా మారనక్కర లేదనుకోవలెను. అందుచేతనే 'రంగడు' 'మల్లడురేవడు'అను రూపములనేకము వాడుకలోనున్నవి.

ఇచట ముతురాజు అనుటచే పుణ్యకుమారుడింక మహారాజు పదవిని పొందలేదని తెలియుచున్నది. మఱున్డ(ఇక్కడ డవత్తునుθగా చదవాలి) పిడుగు అనగా శత్రురాజులకు పిడుగువంటి వాడని అర్థము.'కగ'లమధ్య భేదమింక పూర్తిగా రాలేదు.అట్లే 'త' 'ద' లమధ్యకూడ. తేనికి, దేనికి అని అభేదంగానే వాడబడుచున్నవి.పల్లవ మొదటి మహేన్ధ్ర వర్మ యొక్క 'పగాప్పిడుగు 'అనే బిరుదును పోలిన బిరుదీ పుణ్యకుమారుని' మఱన్డ (ఇక్కడ డవత్తునుθగా చదవాలి) పిడుగు'లేక మార్పిడుగు ' అనునవి.అట్లే మదముదితున్డు'(ఇక్కడ డవత్తును θ గా చదవాలి) అనేదికూడా పల్లవరాజుయొక్క 'మత్త విలాస' అనేబిరుదును పోలియున్నది.చిప೯లియ అనేది చిప్పలి అనే నగర ము.పటుకాను(=పట్టుకాను)అంటే రాజధానిగా రాజ్యము చేయుచుండగా, అని అర్థము. తక్క೯పుఱోల అనగా తర్కప్రోలు అనేఊరు తకప్రోలు అనే వేరే శాసనంలో కూడ వస్తూంది.'పుఱోల'లోని 'ఱో'అను అక్షర ము వలన ముందున్న 'పు'కొంత్కాలమునకు 'ప్రో'గా మార్పునొందెను. అట్లే 'కొఱెచె' అనునది 'క్రొచ్చె 'అని మారింది.'పారదాయ 'అనగా 'భారద్వాజ ' అని కత్తిశర్మ యొక్క