పుట:TeluguSasanalu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కమలాపురం తాలూకాలోదే యిందుకూరులోని శాసనమొకటి రచనలో కొంత మెఱుగనిపించును.

"స్వస్తిశ్రీ చోటిమహారాజుల్లేళన్ ఎరిగల్ దుగరాజుల్ ఇచ్చిన పన్నస కొచ్చియ పాఱ రేవలమ్మాన్ కారికిన్".

అనిఒకే వాక్యములో వక్తవ్యాంసమును పూర్తిచేసెను. అయితే దీంట్లో సాక్షులు లేరు. దనమిచ్చిన భూపరిమితి లేదు. కాని

"తేనిఱచ్చిన వాన్డు(ఇచ్చట డ వత్తును θ గా చదవాలి)వఞచ మహాపాతక సంయుక్తున్డుగు (ఇచ్చట డ వత్తును θగా చదవాలి) . అసివైరువులిఖితం" అని యీ ధర్మమును చేఱిచిన వానికి పాపఫలము. వ్రాసిన వానిపేరు అసివైరువు అని విడిగా రెండు వాక్యాలలో చెప్పబడెను. మొదటి వాక్యములో దాత, ప్రతిగ్రహీతల పేర్లు చెప్పబడినవి. బ్రాహ్మాణుని గోత్రముకూద 'కొచ్చియ '(కౌశిక)అనిచెప్పబదింది.