పుట:TeluguSasanalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు లిపి భాషల మొదలు

రామేశ్వరములోని తెలుగు శాసనాలు అర్థమగుటలో కష్టముగ నుండును.అట్లే తూర్పు చాళుక్య రాజగు విష్ణువర్ధన మహారాజుయొక్క ఱ(అ)హదకరశాసనము సంస్కృతభాగము సులభముగ నుండును. తెలుగు భాగము అర్థముకాదు. ఇట్టివి ఇంకా అనేకము గలవు.అంతేకాక సంస్కృత శాసనాలు సాధారణముగా విద్వాంసులు వ్రాసెడివారు. కనుక కొంతమటుకు నిర్ధుష్టముగనే యుండును. తెలుగుశాసనాలు ప్రజాబాహుళ్యము మాటాడు భాషలోనే యుండేడివి.కనుక గ్రామ్యమనవలెను.దానిని వ్రాయునప్పుడు అనేక లోపములుండును. ఇప్పటిగ్రామ్యభాషనైనను వ్రాయవలెనన్నచో అనేకభేదములుండును. ప్రాంతీయ భేదములేకాక ఉచ్చారణలో కూడ కొంచెం చదువుకొన్నవారు మాట్లాడునది వేరు,చదువురానివారు మాట్లాడునదివేరు.అందుచే ఇట్టిభేదములన్ని మనకు తెలుగుశాసనాల్లో కనుపించును.

తెలుగు భాషలో అఱవ శతాబ్దము వఱకు వాక్యరచన ఉన్నట్లు చెప్పదగిన ఆధారములు లేవు. అమరావతి ప్రాకృత శాసనాలనడుమ 'నాగబు', గాథాసప్తశతిలో పొట్ట, అత్త ,కరణి, మొదలగు పదాలు ఒకటి-రెండు శతాబ్దములనుండి వాడుకలో నున్నట్లు తెలియుచున్నను నాగార్జునకొండ శాసనాల్లోగాని మరి యితరచోట్ల శాసనాల్లోగాని ప్రాకృతభాషలోను,చెదురుగ సంస్కృతభాషలోను వాక్యములున్నవేగాని తెలుగులో వాక్యములు 6వ శతాబ్దిలోగాని కానరావు. అప్పుడప్పుడే ద్రవిడ, ప్రాకృత, కన్నడ , సంస్కృత పదాలనుండి కొన్నిటిని తీసుకొని తమకున్న పదజాలముతో జోడించి తెలుగు వాక్యములు వ్రాయుట మొదలు పెట్టుకొన్నట్లా ప్రాచీన తెలుగు శాసనాలను కొన్నిటిని చూడగ మనకు తెలియగలదు. అప్పటికే మాటాడు భాషలో తెలుగువాక్యాలు ప్రాకృత వాక్యాల స్థానంలో విశేషముగ జొచ్చియుండును.కాని తెలుగులో వాక్యములువ్రాయుట క్రీ.575 ప్రాంతముదనబడు ధనంజయుడను రేనాటి చోళరాజు యొక్క కలమళ్ళ శాసనమును బట్టియే మనకు తెలియుచున్నది. అంతకు పూర్వము రెండు శతాబ్దములనుండికూడ యేకొద్ది వాక్యములో వాడుకలో నుండియుండునని యూహించవచ్చును.మనకు మొదటి తెలుగు శాసనాలు కొన్ని రేనాడు మండలము(కడపజిల్లా)లోనే దొరుకుచున్నవి.అయినను సరిహద్దు జిల్లాలను విడిచి మిగిలిన తెలుగుదేశమంతటను అప్పటికే తెలుగుభాష