పుట:TeluguSasanalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

క్ఱొచ్చె : ఱ→ పూర్వాక్షరమున క్రారముగను, పరాక్షరమునకు ద్విత్వముగను మారును.

వఱచు=వ్రచ్చు

అఱిసిన=చెఱచిన

తాన్డికొన్డ(ఇక్కడ'డ'వత్తును& theta;గా చదవండి)=తాడికొండ=అత్తివర్మ గోరంట్లశాసనము

రెగొన్డ(ఇక్కడ'డ'వత్తునుθగా చదవండి)=విక్రమేంద్ర-చిక్కుళ్ళశాసనము

కుమ్డారు(ఇక్కడ'డ'వత్తునుθగా చదవండి)=పోలమూరు శాసనము

వేయివఱకు అంకెలు వాడుచుండిరి.పుణ్యకుమారునికి తిప్పలూరిశాసనమందు తిథి,వార, నక్షత్ర, హోరలు చెప్పబడినవి గనుక వాటిపేర్లు బాగా తెలిసియుండును. ప్రాచీన తెలుగు శాసనాలలోవాక్యరచనకు ప్రధానముగ కారకనియమము పాటించుట ముఖ్యము. అనగా నేయే సందర్భములలో నేయే విభక్తిప్రత్యయములతో నామవాచకములను క్రియతో నన్వ యించవలెనో గమనించుట ఒక్కొక్క భాషలో నీవిధాన మొక్కొక తీరుగ నుండును. సంస్కృతములో 'చతుర్థీసంప్రదానే' అనిదానార్థమునందు చతుర్థి విధింపబడెను.'విద్ధశర్మణే గ్రామోదత్తః' అని వాక్య ముండును. కాని తెలుగులో అదేవాక్యము వ్రాయుచో 'విద్ధశర్మకు గ్రామమివ్వబడెను' అని యుండును. దానార్థములలో బహుళముగా షష్ఠియే యిట్టివాక్యములందు రూఢియై యుండుట కారణము.క్రొత్తగా భాషరూపొందునపుడు విభక్తి ప్రత్యయము అతిస్వల్పముగ నుండును.వాటిని మాత్రమే ఉపయోగించుచు వాక్యములను రచించెడివారు.కనుక స్థిరమైన భాషయగు సంస్కృతము కంటె తెలుగు భాష ప్రాథమిక దశలో చాలా తప్పులతో లక్షణవిరుద్ధముగ నుండెడిది.ఒకేరాజుచేత వ్రాయించబడిన సంస్కృత శాసనములు తెలుగు శాసనములు పోల్చిచూచిన సంస్కృతశాసనములు సుభోధముగను, తెలుగువి వక్తవ్యాంశముకూడ తెలియకుండగను ఉండును. పుణ్యకుమారుడనే రేనాటి చోళరాజుచే వొసగబడిన మాలెపాడు,దొమ్మరి నన్ద్యాల సంస్కృత శాసనాలు చక్కగా అర్థమగుచుండును.కాని ఆరాజువే తిప్పలూరు,