పుట:TeluguSasanalu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపములే కాని అనుస్వారయుక్తరూపములరుదు.మిగతా అనునాసికములగు బదులు సున్నలు బహుళముగా వాడబచునే యున్నవి

ఈ సున్న యొక్క రూపము ప్రాచీన బ్రహ్మీలిపిలోను,మనతెలుగు లిపిలోను ఒకచుక్క(.)గాపరమందున్న అక్షరముపైన గుర్తించబడెడిది.అనునాసికము వాడుచో పరమందున్న అక్షరమునకు పైన వ్రాయుదుము.గనుక దానిస్థానములో చుక్కను వాడినను అట్లేపరమందున్న అక్షరముపైన నుంఛెడివారు.(ధనజయుదు)ధనజయుదు;రాచమానంబున=రాచమానబున, దేగులబు, వశ,వేగు, వగనూరు, ఫలబు)కొంతకాలమునకు చుక్కయే చిన్న సున్నగా అక్షరము పైభాగముననే వ్రాయబడెడిది.ఇది సాధారణముగ చాళుక్యుల లిపిలో కాన్పించును.క్రీ.1124 నాటి గూడూరు శాసనమునందుకూడ నిట్లే యున్నది.ఇంక తెలుగులిపి ప్రత్యేకత నొందిన తర్వాత అక్షరము తర్వాత,అదే పంక్తిలో నిప్పటివలె సున్నపెట్టుట ఆచారమైనది.దీనికి కూడ కొంతచరిత్ర కలదు.ప్రాఛిణాళీఫీళొ 'మ'కారము హల్మాత్రమే వ్రాయబడినచో 'δ'వ్రాసెడివారు.అంటే మ్=δ.ఇదే కాకతీయుల నాటికి పూర్వమే పైనున్న పొల్లు లేకుండ '0'గా మారింది.మ్=δ=ం. ఇటువంటిది అయ్యిందన్నమాట.కన్నడలిపిలో కూడ నిదేచిధముగా మారింది.క్రీ.1100 ప్రాంతపు కందూరు చోళుల వొల్లాలశసనములో సున్నకు బదులుδవాడుటకలదు.ప్రాకృత భాషాసంపర్కముతగ్గి సంస్కృతభాషాప్రభావమెక్కువైనకొలది అనుస్వారమునకు బదులు వర్గానునాసికములను వాడుట యెక్కువైనట్లు కనిపించును. ఉదా:-డౙ్కల పూణ్డి,సమరస ౙ్గట్టణ,సమాలిజ్గిత,ప-మహాపాతక,రాజ్య-య,ప్రసాద--,కు--,వసన్తీశ్వరము,వందిత,వసుందరాం,నేణ్టి,వైదుమ్బ,సమ్పన్నుణ్డు.మొద||

ఉచ్చారణమునకు తగినట్లు వ్రాయుట చేతకాకపోవుట నేడుకూడ మనకు తెలుసు. భాషాంతరపదాలు వాడునప్పుడు మరీ కష్టము.Bank ను బంకు,బాంకు,బ్యాంకు,బేంకు అని వ్రాయుచుందుము.కొరవి శాసనములో చాయంబడిన అనేపదమిట్టిదే.పొడచిన  అనుటకు పొడిచ్చిన ,అదాయంబు అనుటకు అదెయమ్బు  వ్రాయుట,ఇవి అన్ని ఉచ్చారణ దోషములో వ్రాయుటలో తప్పులో చెప్పలేము రెండు ఆనాడట్లే ఉన్నవి.