ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుఁగు జాతీయములు
47
అమ్మకచెల్ల
అమ్మ చెల్ల
ఉ. అమ్మకచెల్ల! నాహృదయ మమ్మక చెల్లదు వీని కియ్యెడన్
విజ. ఆ. 1
ఉ, అమ్మక చెల్ల!యుల్లమున నంగన యెవ్వ తెయున్ రవంతయున్
నమ్మఁగ నొప్పు దెప్పుడు ననామకులం బురుషగ్రహములన్
నమ్మనుబో, లబో యని యనారతమున్ వగ మీఱి వారి
వాక్యమ్ముల పేరిటింగలమునందున బూతియ కాక తక్కునే?
భద్రావత్య. 2 ఆ.
ఉ ......కిమ్మననీదు మోము గిరి క్రేఁపులు మూఁపులు కౌను
గానరా దమ్మకచెల్ల ! వానివికచాంబకముల్ శతపత్ర
చైత్ర ముల్.
మను. 3. 6
అమ్మను బట్టి వసంతము జిమ్మినట్టు
బావమఱఁదుల వావి గలచోట వసంతములాడుట జెల్లుఁ
గాని మాతృస్థానమున నట్టివి కూడనివి, పాపఫలప్రదములు.
కూడనితావునఁ బ్రవర్తించుట అని భావము.
క. కమ్మని తేనెలు జడిగొన
నమ్ముల నిటు నింతురయ్య యబ్జాలయపై
నమ్మనుబట్టి వసంతముఁ
జిమ్ముద మను పలుకు నిజము చేసి మనోజా !
లక్ష్మీవి. 4 68