ఈ పుట అచ్చుదిద్దబడ్డది
46
తెలుఁగు జాతీయములు
అభ్రపుష్పము
గగనకుసుమము
శూన్య మని భావము.
చూ. గగనకుసుమన్యాయము.
సంస్కృతన్యాయములు పే. 18
ఉ. పాపదురాపరూప మగు పద్మసమాహ్వయ తీర్థమౌళి నీ
వరే పురుషుండు గ్రోలు నొక యించుక యెన్నడునేని వాని
కిన్ బాపము లభ్రపుష్పములు, బంధనముల్ శశశాబ
శృంగముల్, తాపవికారముల్ మరుజలంబులు, పుట్టువు
లశ్మ తైలముల్ .
పాండు. 5. 72.
సీ. ఆ. కలలు కల్లఁ లయ్యె, దలఁపు లభ్రసుమమ్ము
వలపు లయ్యెఁ, గాని వావియయ్యెఁ
గోర్కులెల్లఁ, జెల్లెఁ గూఁకటివేళ్ళతో
జీవనద్రుమమ్ము దేవదేవ !
వ్యాఖ్యాతల చాటువులు.
అమ్మచెల్ల
ఔర! (సంభ్రమాశ్చర్యసూచకము)
ఆ. అమ్మ చెల్ల యిట్టు లనకుము గొండలు
లోనుగాఁగఁ బవనుచే నసా స్త
మహిమ...
భార. శాం. 3. 387