Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు

43

త్వ్తము దీపింపఁ దపంబొసర్చు జటిల వ్యాఘ్రం బనాఘ్రాత
పుష్పము చందం బగు మేన నూన నియమభ్రాష్ట్రాగ్నిఁ
దగ్గించుచున్.
పాండు. 5. 186
అనుము, మినుము
కిమ్మన కుండ మౌనముద్ర వహించుట
అనుము మినుము లేదు.
అనుపు దప్పు
పస చెడు
సీ. అనుపు దప్పిరి నొచ్చి కలసి రాపద నొంది
రదవద లైరి చీకాకు పడిరి
యంగలార్చిరి విచ్చి రారడిఁ బొందిరి
బ్రమసిరి పాఱిరి పల్లటిలిరి
హరవి. 3. 10
వ. ..వాహినులు చిక్కు వడి చిందఱవందరై, మతి చెడి
మల్లామడియై, యేపు దెగి యవురుసవురై, యనువు దప్పి
యదవదయై, యంతంత విచ్చి యరవరలై....
ఉ. హ. 1. 148
అన్నదమ్ములగు
ఒకేరకముననుండునవి (వారు) యగు