ఈ పుట అచ్చుదిద్దబడ్డది
26
అడపొడ
జాడ (పులుగు)
చ. కడు నుతి కెక్కుకునట్టి యధికంపుఁగులీనతచే నతండు న
ల్గడల జనాధిపుల్ దనకుఁ గన్యల నిచ్చెదమంచు నెందరే
బడిబడిఁ జెప్పి పంప నది పాటిగఁ బట్టక వారి యీసు చే
నడపొడ లేక పోయెనఁట యల్పము లయ్యెఁ గులాభి
మానముల్.
కళాపూ. 7. 44
చ. తొడిఁబడఁ బాఱి పై కుఱికి ధూర్జటికంటికడిందిమంటలో
నడపొడ గానరాక తెగటాఱియుఁ గాలినయట్టి మ్రోడు కై
వడీ రతిలోచనాంబువుల వాన నిగిర్చితి పాంథ బాధకై
మడియ కనంగ! యవ్వెలఁదిమంగళసూత్రమహత్వ
మెట్టిదో!
మను. 3. 46
వ. తా నెక్కడ నడంగెనో కాని యడపొడ గనరాఁడు.
ప్రబోధ. 5. 2
అడవియామలకము, అంబుధిలవణము
అడవియుసిరికాయ, సముద్రపుటుప్పు కలిసినట్లు.
ఎక్కడెక్కడివారికో ఒకచో సమాగము గలుగుట.
ఆ. తడవు దినములకును ధరణీసుర శ్రేష్ఠ
మాకు మీకు సంగమంబు గలిగె