ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుఁగు జాతీయములు
17
అగ్రతాంబూల మందికొను
మొదటి తాంబూలము పుచ్చుకొను
మిక్కిలి శ్రేష్ఠ మవు; అగ్రేసర మవు
...... సంగీతశాస్త్రములో ఏపద్ధతి అగ్రతాంబూలము
నందుకొనునో అది సంగీతజ్ఞుల కెఱుక. కాని, ప్రపంచము
అనుకరణములలో మునిఁగి తేలుచున్నది......
కవిమాయ (భూమిక) పే iii
అగ్రహారములో తమ్మళి జోస్యము
పండితులకు బహుమానముగ నీఁబడు నూరి కగ్రహార
మని పేరు. అట్టి అగ్రహారమున తంబళ జోస్యము చెప్పి
నట్లు.
అధికునియెదుట నల్పుఁడు ప్రజ్ఞ చూపఁ బోయి పరిహాసా
స్వముఁ డగుట యని భావము.
క. ఎమ్మెలు నాముందఱనా
యమ్మక్కరొ! చెల్ల వగ్రహారములోనన్
తమ్మళిజోస్యము లన్న వి
ధ మ్మిది నీవలన నాకుఁ దథ్య మ్మయ్యెన్
రుక్మాం. 5. 88
అచటఁ బుట్టిన చిగురుకొమ్మైనఁ జేవ
అచటఁ బుట్టిన లేయిగుళ్ళతో నున్న కొమ్మైనను జాల
సారముగలది.