Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

తెలుఁగు జాతీయములు

సంపకము లంచు మఱి యెన్ని యైనఁ గలవు
కాంక్ష లవి యుండె మీఁదటి కతలు వినుము.
కువల. 3. 65.

అగ స్త్యభ్రాత

అగ స్త్యభ్రాత యెవరో యాతని యూరు పే రేదియో
నెందును గానరాదు.
ఊరు పేరు తెలియని కశ్చనగాఁడు.

అగస్త్యమంత్రములు పలుకుట

(బొజ్జ సవరించుకొనుచు) జీర్ణం, జీర్ణం, వాతాపీ! జీర్ణం
అని అనుట.
సీ. కక్కుర్తి మెక్కి యగ స్త్యమంత్రము వల్కు
        బొడ్డు నంటుచు నొక్క భూత నేత
తనివి తీఱిన త్రేఁపు విన్నునకు నిక్క
శతపదాల్ ద్రొక్కు నొక్కనిశాచరుండు
పలలరాసుల బువ్వంబుబంతివిందు
మించుబోడులతో నారగించు వేళ.
కువల. 2. 150.
అగ్రతాంబూలము
ప్రథమతాంబూలము (శ్రేష్ఠ్యము) (మొదటిస్థానము)
...తుట్టతుదకుఁ గట్టుకొన్న దానిని బిలుచుటయైన చేత
కాని చచ్చు పెద్దమ్మలతో నగ్రతాంబూలమునకు సిద్ధ
మయినాఁడే!
సాక్షి. 189 పే.