Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

తెలుఁగు జాతీయములు

యుంటి లక్ష్మీనరసింహ! నాకు దయసేయుము నీదుక రావ
లంబమున్.
శ్రీవిద్యా. 3. ఆ.
అంతలపొంతలవాఁడు

పరంపరాసంబంధముగలవాఁడు

సీ. చనును బరంపరాసంబంధి యంతల
         పొంతలవాఁ డంది పొందినట్టి
వాఁడనంగను ... ... ...
ఆంధ్రభాషా.
తే. అంతపొంతలదాన నటన్న నేమి
దానవారికి నీవంటిదాన నేను
గాన నీతోడి వంతుకు రా నటంచు
గర్వమును జెంది కలహింపఁ గార్య మగునె?
వేంకటే. 3. 228
ఉ. ఆపురపంచకంబు తన యంతల పొంతల యిండ్ల పిండు సూ.
కతుత్థ్స. 4. 177
అంతు పంతు

తుది, మొదలు
ఈ అంతు పంతు లేని అఱవచాకిరికే జనియించితిం
గాఁబోలు.

అందని మ్రానిపండ్లకు నఱ్ఱులు సాఁచు

తన, కందక, ఎత్తుగ నున్న పండుకోసమై మెడ యెత్తి
ప్రయత్నించు.