పుట:TellakagitaM.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
[[దస్త్రం:|450px|page=58]]

ఆధునికత పేర వదిలేసే
పద కాలుష్యాన్ని కారాదు.. పది మందిని తన పరిమళంతో పరామర్శించే పవిత్ర పుష్పాన్ని కావాలి..
నే కోరేది నిరక్షర కుక్షి మస్తిష్కంలోకి నా మహా ప్రస్థానం
 నే కోరేది సుషుప్తావస్థలో ఉన్న సమాజపు చైతన్యం.

నేనంటే అంతరిక్షప్రయోగం కాదు..
అత్యున్నత న్యాయస్థానపు నిర్వచనం కాదు..
బుగ్గైన పసి మొగ్గల జీవితాలు కాదు..
నేనంటే ..
ఒక అద్భుతానికి ఆశ్చర్యం
ఒక విజయానికి ఆనందం
ఒక బీభత్సానికి అశ్రుతర్పణం .
నా కోరిక మానవతా ఉషోదయాన్ని తట్టిలేపే చైతన్య స్ఫూర్తిని,
లోక రక్షని.. కావాలని. ఆ లక్ష్యం తీరే వరకు ..
ఒక అద్భుత రాగోద్భవార్థం. . కత్తి గాటుకు గురయ్యే మురళిలా..
 ఆ కృష్ణుని రాకకై విరహోత్కంఠిత రాధికనై ..
ఎదురు చూస్తూనే ఉంటా..

బోయవాని బాణానికి బలయ్యే
పక్షులెన్ని ఉన్నా..
మరో వాల్మీకి జననం కోసం
క్రౌంచ హనన సందర్భ సంజనిత
శోకమే ..శ్లోకమయ్యే వేళ
 పెంటి పక్షినై
నిరీక్షిస్తూనే ఉంటా ..
తలవాలిన తడవ తడవకూ తలకట్టై లేస్తునే ఉంటా..
నాది చెరగని రాత.. నేను చెదరని గీత..నేనక్షరాన్ని
(విష్ణు చైతన్యకి :
అన్నాయ్! ఈ తెలుగువెలుగు అక్షరాన్ని.. తెలుగువాచకాలలో చూడకపోతామా.. ఈ అక్షరమాల మన మమకారాన్ని లోకాన గుబాళించక పోతుందా !!.. )