పుట:TellakagitaM.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ శ్రీ రాబందుల రెక్కల చప్పుడుతో నిద్ర లేచా ..
మైలమ భీమన కలల ఖడ్గ సృష్టి చేశా.
దాశరథి అగ్నిధారనై రుద్రవీణనై వినిపించా ..
సినారె విశ్వంభరలో నక్షత్రాన్నై దారిచూపా .
శేషేంద్రుని శేషజ్యోత్స్ననై ఎర్ర కోరిక కోరా.
ఇప్పుడు ఇప్పుడు..ఇప్పుడునే
ప్రజా విప్లవ ప్రవాహ తాలోత్తాలపు తరంగాగ్రాన్ని..
ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతపు ఘీంకారాన్ని
వెన్నెల్లో ఆడుకునే ఓ అందమైన ఆడపిల్ల ప్రతిరూపాన్ని,

అక్షరంలోని అంతరిక్షాన్ని ..
మనోంతఃరిక్షంలోని అక్షర నక్షత్రాన్ని
న్యాయాన్యాయ విచక్షణని ..
విద్యాధికుల విలక్షణాన్ని
అక్షరాన్ని నేనక్షరాన్ని.

ప్రేయసి పెదవులపై ప్రణయ వేదాన్ని..
తాపసి ఉచ్చ్వాస నిశ్వాసల ప్రణవ నాదాన్ని..
కవి కలం పడేటి ప్రసవ వేదనని..
భావం అంతర్వాహినిగా.. అక్షర ఆలాపనల త్రివేణీ సంగమాన్ని..
పక్షినై వినీలాకాశంలో చేస్తున్న ప్రదక్షిణాన్ని..
అక్షుబంధిత ధర్మ దేవతకు ప్రత్యక్ష సాక్షిని.. నే నక్షరాన్ని.
 ఇప్పుడు నే లక్ష కోణాలతో క్షుద్ర సమాజపు పాప ప్రక్షాళనకై నడుం కట్టిన వజ్ర దీక్షను..
అనుమానపు అర్ధ విజ్ఞానం కాదు నే కోరేది..
 పునఃపరీక్షతో పరిణతి చెందే పరిపూర్ణ జ్ఞానం.
హెచ్చు తగ్గులకై ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతాలు కాదు కావాల్సింది ..
ప్రేమ పూరిత గురుకులం పొందుపరచిన తడిఆరని అక్షరాల ఆపేక్ష సిద్ధాంతాలు..