పుట:TellakagitaM.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిచ్చుకా.. ఓ పిచ్చుకా!

ఎన్ని కథలు విన్నాం అమ్మ ముద్దుల మధ్య
వసారాలో నీకై కట్టిన వరికంకిల్ని ఎక్కి
ఎన్ని పెరుగన్నం ముద్దలు తినిపించావ్
కుండ మూతలో పోసిన నీళ్లు నువ్ తాగినప్పుడల్లా
నే కొట్టిన కేరింతలు ఎన్నెన్నో

నువ్ తుర్రుమన్నప్పుడు నే కేర్ మన్నానో
నే కేర్ మన్నప్పుడు నువ్ తుర్రుమన్నావో
నువ్వెప్పుడు ఎక్కడ ఉంటావో
గాలి లేని గదుల్లో ఎలా ఎగిరావో
ఫాను కిర్రు ఆగితే కిటికీలోనూ నువ్వే
కుదురులేని పిట్టా!! నీ పేరే తుందురు పిచ్చుక..
అవసరాల వారి పొట్టిపిచ్చుకవో..
ఆస్కార్‍వైల్డ్ హ్యాపీప్రిన్స్ నేస్తానివో
ఎన్నికథల్లో తిప్పావు నన్ను!!
అందమైన తలపుల్లో నువ్ కనిపించని ఆత్రానివి
ఒకటి రెండు కబుర్లు నీవి నలుగురితో చెప్పుకోనా
౧.
అనగనగా ఒక రైతు ఇల్లు.. తడుస్తూ చలికాలపు రాత్రివేళ
కిటికీ లో పిచ్చుకలు జంటలు జంటలుగా జడుస్తూ
జాలిగుండె రైతన్న గడ్డి పరచి.. మిమ్ము పిలిచి
ఎన్ని చేసినా మీరు లోపలికి రారాయే గింజలేసినా తినరాయే!

ఇంతలోన వెలిగిందీ ఆలోచన..
తాను కూడ పక్షైతే దొరికెనా ఓ దారి అని
అర్థంకాని తనపు ఈ సందు పూడేది లే.
అయినా తెలిసింది ఓ దేవ రహస్యం
దేవుడెందుకు మానవుడై మన మధ్యకు వచ్చాడో అప్పుడు.
మనిషి మనసేంటో.. మనిషి రూపంలో ఉన్నవాడికైనా తెలుస్తుందేమో అని..

అనగనగా ఓ బుర్రు పిచ్చుక పడింది మనిషి ఉచ్చులో
ఏమిచేస్తాడో చేసింది వాకబు .. తిండికి సిద్ధం అన్నాడు
వేలెడు లేని పిట్టను నేను. ఆకలి తీరే తీరు లేదు