పుట:TellakagitaM.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉడాతా.. నీకూ- నాకూ తేడా

రాములోరి వారధికి రాళ్లెత్తిన ఉడతా
ఎందుకే నీకంత డాబు భక్తి ముసుగా నీ వెనకా!!
సమర్థుడు సాహసి వాడు అని నువ్వూరుకున్నావా
కోతులతో పాటూ నాకూ ఉందని తోక ఊపుతూ వెళ్ళావా!!

ధర్మరాజు యాగంలోన కథలు చెప్ప వచ్చావంటా
రంతిదేవుని దాతృత్వం రంగు పూసి వల్లించావా!
రాముడు నిమరిన వేళ్ళ చారలైనా వంటి మేలిమి మిసమిసైనా
నీ మూతి విరుపో, వంటి తీరునో చూపడమేలే ఆంతర్యం

పుట్టి కన్ను తెరవడానికి నీకు 40 రోజులెందుకో
నిద్రానంతర ఊర్మిళలా రంగు తిరగడానికా!
యువరాణి లేఖ రాయలన్నా.. ప్రియుడు బొమ్మ గీయాలన్నా..
నీ తోక పీకి వాడాలనే పితలాటకం పెట్టిందెవరో
నాజూకైన దేహం.. గుబురుబొచ్చు తోకా.. చారడేసి కళ్ళూ
ఏ సౌందర్యరాశి నీసాటి! స్వేచ్ఛాజీవివి నీకేది పోటీ!!
నువ్వు లేని ఊరు లేదు; నీ అందం చూడని కళ్ళు లేవు
చేతిలో పండో -గింజో ఉంటేనే నావైపు నువ్వొస్తావా!!

ఆడపిల్లల్లా మెరిపిస్తావ్.. మురిపిస్తావ్.. వెక్కిరిస్తావ్..
మొగపిల్లల్లా గంతులేస్తావ్.. భయం వదిలి పరుగులు తీస్తావ్
ఎండకాసినా ..వాన వచ్చినా.. తోక గొడుగులో దాక్కుంటావ్
ముందు జాగ్రత్తతో ఉన్నట్టుంటావ్.. పట్టుకుంటే కరుస్తావ్

చటుక్కున కనిపించి పుటుక్కున జారుకుంటావ్
మాకూ నీకూ తేడా నీ సున్నితత్వం
పువ్వులని వాసన చూసినా తెంపకుండ వదిలేస్తావ్
నువ్ చనిపోయినా.. బొమ్మలానైనా పనికొస్తావ్;
మాకన్నా గొప్పగా నిలిచివుంటావ్.
( జీవ వైవిధ్య సదస్సుల నేపధ్యంలో*..౧)