పుట:TellakagitaM.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మంచి బహుమతి

నేలమ్మ కు ఇద్దామా మనమూ ఒక బహుమతి ..
బహుమతమై వర్ధిల్లని దీవిస్తూ జగతిని .
ఎందుకొచ్చిన అసహనం! ఏం బావుకుందామని ?
ఆడ-ఈడ దాడు లేమి?
ఓటి కుండ బతుకులాయె వేటగాళ్ల తల్లీ.

నువు పంచిన ప్రేమేనా! కొంప ముంచింది!!
మగ నలుసై విర్ర వీగి ఇంత వరకు తెచ్చింది .
కన్న పేగు తెగి పోయి కారుణ్యం కరిగి పోయి ..
మరణానికే ఋణ మంటూ అనుబంధాలను కడతేర్చింది.
మంచోళ్ళకు నూక లేదు నేల మీద .. ఓ చెల్లీ!!
ఎన్ని సార్లు ఈ ఓటమి నా తల్లీ ..
మోసపోయి ఒకసారి.. నువ్వు పోయి ఒకసారి..
కన్నవారిని కోల్పోయి .. ఎన్ని సార్లు! ఎన్ని సార్లు!!
ఎన్ని సార్లు ఈ ఘోరం..? ఎందుకింత కార్పణ్యం ?
కలిసి నీ నీడ లోన మసులుకున్నందుకా?
కసి పట్టి కడతేర్చావు మళ్లీ. మళ్లీ..


నువు పంచిన మంచినే మేమంతా మరిచాం.
వంచనే మా మతమని నిరంతరం జపించాం
నీ బుద్ధులు ఆ సుద్దులు నిలుపుకునిన మగవాడు
కాడెపుడూ నీ బిడ్డకు పగవాడు .

దీవించూ ఓ తల్లీ !
నీ సహనం రావాలని సమ్యమం కావాలని
అదేలే మేమిచ్చే మా మంచి బహుమతి
(ఓ ఉన్మాది ఘాతుకానికి తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్మాయికి..)