పుట:TellakagitaM.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఓ రైలు ప్రయాణం

ఇష్టం లేని ప్రయాణాన్ని
కష్టంగా చేయించడానికి రైలొస్తుంది స్టేషన్లోకి ..
పెదాల పట్టాలను బిగబట్టి..వేగమంత వేవిళ్ళతో..
ప్రసవార్ధమై ముక్కుతున్న పూర్ణ గర్భిణిలా ..
ఇష్టం లేని ప్రయాణాన్ని
కష్టంగా చేయించడానికి రైలొస్తుంది స్టేషన్లోకి
అనుబంధం ఏ నాటిదైనా ఆగేది ఐదు క్షణాలంటూ.. రేకెత్తిన ఆలోచనలనూ.. రైలెక్కించడానికి .. ఇష్టం లేని ప్రయాణాన్ని
కష్టంగా చేయించడానికి రైలోస్తుంది స్టేషన్లోకి
నాకు ఊరు ఒదలలాలంటే..
తల్లిని వదిలే చంటోడి కున్నంత బాధ
నా ఏడుపు కేక కోసం ఆనందంగా ఎదురు చూసిన తండ్రిలా నను పట్నం పంపే కిటికీ కరచాలనాల సంఘం
తెగవలసినదని తెలిసినా.. తోడొచ్చే తల్లి పేగులా ..చిన్న నాటి నుండి
పెనవేసుకున్న స్నేహ బంధం ..
ముందుకు సాగే రైలుకి ఉన్న వెనక్కి తిరిగే చక్రల్లా.. నను సాగనంపుతాయి .. ఏడుపో రాగమో తెలియకుండానే..
 రైలు.. నేను.. ముందుకు సాగుతాం.
కంపార్ట్ మెంట్ లైట్ల వెలుగులో కదిలే కాలువ
 ఆగిన రైలనిపిస్తుంది
నాకది.. చెలియలికట్ట దాటీ దాటని
చెలి కంటి చెలమను తలపిస్తుంది.
దూరమౌతున్న ఊరులా పలచనౌతున్న
సిమెంట్ బెంచీ సింహావలోకనాలు ..
ఎదురొచ్చే మరో రైలు రొదలో ఉలికిపాటు పడుతుంటాయి.
ఆ సమయానికి ముందు స్టేషన్లో
మైకో- గంటో అప్రమత్తమౌతుంది
రైలింజను నిట్టూర్పులతో బరువు దించుకుంటాయి.. బెంచీలన్నీ
బరువెక్కిన మనుషులను ఎత్తుకున్న బోగీలు పట్టాలను కరుస్తూ..
ఇష్టం లేని పెనిమిటితో కాపురానికా..! అన్నట్లు ..
కష్టంగా ప్రయాణాన్ని చేయించడానికి ..
రైలెళ్తోంది మళ్ళీ చీకట్లోకి.. (నాటి మాట..)