పుట:TellakagitaM.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునిక స్వేఛ్ఛ

నచ్చింది చేయడమంటే.. విప్పుకు తిరగడమా!
వచ్చింది చెప్పమంటే.. తలపుల్లో తప్పుల చిట్టా అప్పచెప్పడమా!!
మూలాలు మరచిన మూర్ఖత్వం ఇప్పుడో నాగరికత
కాలాలు మారినా మారని క్రౌర్యం ఈనాటి ఆధునికత
ప్రకృతి ఆరాధన ఇప్పుడో అపవిత్రం
సున్నిత మనస్తత్వం ఓ స్మృతి శకలం
ప్రతీకల్లో కవినీ, కవితలనీ వెతుక్కోవడం గగన సదృశం
అభివ్యక్తి, ఆడతనం నలిగిన రోజుల్లో
అవ్యక్తవేదనా అంతర్మథనం మొరటు శృంగారం
కట్టుబాట్లను తెంచేది కవిత్వమన్న భ్రాంతి ప్లేటో కాలానిది
భావోద్వేగ బంధనాల నుంచి బయల్పడడమే ఇప్పటి వ్యక్తీకరణ
భాషను కాదు.. మనసును సంస్కరించుకోవాలి
మనిషితనాన్ని మనమధ్య మిగుల్చుకోవాలి.
తడి ఆవిరయ్యాకా మిగిలేది..విశ్వమంతా.. స్వేచ్ఛే..
పొడారిన శూన్యమే

విషాదానికి ఓదార్పు

నిన్నా రేపు నడిమిట్టా ఎందుకొచ్చావ్ మళ్ళా?
పొలంలోని పంటబోదె నీరెత్తినట్టు..
గుండెకోతల జ్ఞాపకాలు తొలిపొద్దు నీరెండలా తొంగిచూస్తున్నట్టు.. మొన్నటి తొలకరి మింటిధార తీపిని
కంటి చారల ఉప్పదనంలో కలిపేస్తున్నట్టు
తెలిసిన ముఖమేగా! ఎందుకు చిన్నబుచ్చుతావ్ మళ్లీ?
అవసరమొచ్చినపుడే.. అపుడెపుడో శైశవంలో చిగురించావ్
బాధల్ని మోసే శక్తి నిచ్చి..‘ఈ ఏడుపొకటి’.. అనిపించావ్
చిన్నదైందని.. చిరగని చొక్కాని వదిలేస్తున్నప్పుడు..
జీవితం ముందుకి తోస్తున్నప్పుడు.. ఆశల తీరానికై బతుకునావ
ఆకలి కడలి కడుపుని కోస్తున్నప్పుడు.. ఎదుగుతున్న గుర్తుగా కనీకనిపించని చేతివంపు వళుల్లాగ అనిపించావ్.
ఆలోచనల చలనంలో చేయి కలిపే ఆగంతుకుడివి
ఒంటరి మననంలో తోడుండే అనుయాయివి..అన్నిమార్లూ
కన్నీరై కదలనంతమాత్రాన నా నవ్వులో నువు లేవన్నానా!!