పుట:TellakagitaM.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుల్ మకాయీ*!

నువ్వెవరని మాకు ఈ తలపులు మలాలా!!
‍11 ఏళ్లకే బ్లాగర్ వయిన పిన్నవనా!
సాటికవి కన్న కూతురివనా!!
చదువులతల్లి పేరేదైనా నీకది పర్యాయపదం
నీడైరీ చదివాక తెలిసింది నీవొక నిశ్చయమని..
జనవరి 4, 2009 న నువ్ బిబిసి బ్లాగులో రాసిన మాట..
రేపు స్కూలుకి వెళ్ళాలని.. ముందురోజుల నీడన
చదువు పేరెత్తితేనే భయం. నీమాట.. ధైర్యమైంది ప్రతి నోటా..
అర్థమైందిలే ఈ రోజు . నీశక్తి..ఆలోచన
మురిపించే స్వాత్ అందాలలో జ్వలించే క్రాంతిరేఖ
నీ చిరునవ్వని ’రేడియో ముల్లా’ఫజులుల్లా గాడు చూసిన
2 ఏళ్ల భయం పేరే నువ్వని మలాలా..
 మా నాగరికత నడిచొచ్చిన కైబర్ కనుమలలో సుమానివి..
రాజకీయ రంగమే నుదుటి రాత మార్చగలదన్న నీ నమ్మకం
ఆధునిక విద్య అవసరమని.. నొక్కిచెప్పిన నీ అంతరంగం
వాడిన ముఖం వికసించాలని ఈలోకం ఎదురుచూస్తోంది.
అదే తెగువ చూపించు.. బతుకుతో పోరాడు.. బతుకుతూ పోరాడు.
తాలిబన్ల పిరికితనానికి బదులివ్వ రావాలి అసలు సిసలైన జవాబై.
నా కంటి చెమ్మ సాక్షిగా చెబుతున్నా
పాకిస్తాన్ లోగిలిలో పూచిన మానవతా ప్రియనేస్తమా
నువ్ విరబూయడం కాంతి పంచే సూరీడుకి అవసరం
రేపన్న లోకం లో నీ స్ఫూర్తే మేము కోరే మార్పు..
బడికెళ్ళే ప్రతిపిల్లా మలాలాలా..
ఉద్యమించే అవసరాలు రానీకమ్మా!!

నువ్వెత్తిన పిలుపులో మేమంతా గొంతుకలుపుతాం..
ఎందరికోసం మొదలుపెట్టావో.. అందరం నీ బాట పడతాం..
బదులివ్వరావా అసలు సిసలైన జవాబై.
( *మొక్కజొన్న పువ్వా! : మలాలా జీవన్మరణ పోరాటంలో పడి ఉండగా.. కవి కిరణ్ గాలి కి తోడుగా)