పుట:TellakagitaM.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భయ్యా! Diversity ఎక్కడ!

జీవవైవిధ్య సదస్సు ముగిసింది.
ఇక కాగితాలపై అభయారణ్యాలు పెరుగుతాయి
ప్రపంచ ప్రతినిధులారా!
విమానాలెక్కండి.. సురక్షితం మీ ప్రయాణం

డేగల్లేవిక్కడ.. మాది డేగలేని దేశం
అంతర్జాతీయ జలచరాల్లారా!.. sea horse లూ!!

ఆక్వేరియం ల అద్దాల్లోంచి నేరుగా మీరు మా కడుపుల్లోకే
ఔషధ మొక్కలూ ఎదగాలి మీరు
విత్తన వ్యాపారమా! సౌందర్య వర్తకమా ! వర్ధిల్లు ! వర్ధిల్లు !

వర్ధమాన దేశాలూ!! అప్పు అడగండి..
20 సూత్రాల పథకం అమలుకి డబ్బుల్లేవ్
ఏకథ చెప్పినా కావాల్సింది కనకమేగా!
de Souza Dias! ఈ సాయంత్రం నుండే నువ్వో అనామకుడివి
నీ ఆచరణ మంత్రం అమలు ఇక కంఠశోషే..

20 ఏళ్ళు నిండిన సదస్సుల ఆరంభానికన్నా
ఈరోజు ఓ redlist పొడుగు 400 లైన్లు ఎక్కువ
మొక్కలెక్కువా! మాకు కుక్కలెక్కువా!
 
కొరియా! తయారయ్యావా 2014 సదస్సు కి
oyester ల pancake ప్రపంచానికి తినిపించడానికి.

అమెరికా! నువ్వేనయం.. నువ్వేనయం.
చాంద్రాయణ వ్రతం నీ సంస్కారంలో లేదు
(మెచ్చిన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారికి, .. కవిసంగమంలో కలిసిన మిత్రులకు..)