పుట:TellakagitaM.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలాగే.. అలాగే..

నిద్రలేచాకా నేలను కాలు తాకితే ..
పచ్చనోటు తొక్కినట్టే.. అద్దె డబ్బులు.. పెరిగాయి కదా!
అడుగులేసి అద్దం చూసేలోగా ప్రతిబింబం హెచ్చరిక
పేస్టు పొదుపుగా వాడమని.. స్నానం గోరువెచ్చని నీళ్ళతోనే సరి
సబ్బు కన్నా చెయ్యే ఎక్కువ అరుగుతుందీలోపల
తువ్వాలన్నా సరిగా ఆరేసుకుందాం. ఎన్నని కొంటాం!!
లోగుడ్డలూ మేజోళ్ళూ పోనీలే ..
మరుగున చిరుగులు కనిపించవు
ఏమోయ్! పెళ్ళికి కొన్న రింకిల్ ఫ్రీ పేంట్లెక్కడ.. ఈ బటనుకుట్టు.
లంచికి కారేజీ పెట్టరాదూ.. కాంటీన్ రేట్లు పెరిగాయీ!!
బస్సెక్కుదామా.. బండితీద్దామా!! ఆఫీసుకేగా ఫ్రెండు తోపాటే..
అరె! పెన్నేదిరా.. నీదివ్వు ఈరోజుకి
సాయంత్రం వచ్చేటప్పుడు నీకేంకావాలి!
అడుగు పర్లేదులే తెస్తా.
నాన్నా! బాగాచదువుకో.. లేకపోతే మీ నాన్నలానే..
కాఫీ ఎందుకూ.. ఆఫీసులో తాగేస్తాగా.
ఏమోయ్! పండక్కేంకొనుక్కుంటావ్! నాన్నా!! నీకు..?
ఏంకావాలి చెప్పండి.. ఎలాగైనా కొనిస్తా సరేనా
మా ఆఫీసతని పెళ్ళుంది ఈనెల.. మంచి చీర కొనుక్కో..
పిల్లాడిక్కూడా.. ఇంద క్రెడిట్ కార్డు.
హలో.. హలో..టెలీఫోన్ బిల్లేగా .. ఇప్పుడు కట్టేస్తా..
ఆ గాస్సిలిండర్ డబ్బులిలా పట్రా..
సాయంత్రం సర్దుబాటు చేస్తా. నీకో గుడ్ న్యూస్ ..
ఈనెల డి.ఎ. పెరిగింది ఎంతో తెలుసా!! మూడొందలు
రాత్రి లేటవుతుంది.. మీరు భోంచేసేయ్యండి..
బాసుతో పనుంది సాయంత్రం.
నీకు మల్లెపూలూ.. వాడికి హనీకేకు.. అలాగే.. అలాగే..
(మధ్య తరగతి మహాభారత యుధ్ధంలో యోధులందరికీ..)