పుట:TellakagitaM.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తుహినం తుడు

పేరు తలిచి నిను పిలిచి వినేలోగా
ఈ శరద్రాత్రి చలై నను కొరికేస్తోంది
ఏదో మాట నను తడుముతోంది.. నీ తలపుల్లోకి తరుముతోంది
తపన తలపులను తాకలేదా
గుండెలను కరిగించి పోసిన గంట
కాలమై కాలుస్తుందో.. రవమై మోగుతుందో!

ఎంతదూరాన ఉన్నా.. నీ మేనిగంధాల పలకరింతలు
నను దాటివెళ్ళిన జాడలను
మరుగుపరచలేక నిలువనీయకున్నాయి
నీ ఊహే లోపలా బయటా మంచుని కరిగిస్తుందే
నిట్టూర్పుల్లో మన ప్రేమ వెచ్చదనం
మంచుబిందువులను ఆవిరి చేసినా
గతించడాన్ని మాపలేని కాలాన్నడుగు మన సంగమాన్ని
నిరంతరతను నింపుకున్న మన స్నేహాన్ని అడుగు
నిన్ను-నన్నులను దాటిన మన భావననడుగు
వేర్లు వేరైనా ఒకటైన మన జీవితాలని అడుగు
మనం లేని నాడు ఒకరికొకరిని చూపించడం నేర్పమను కళ్ళకి
మన అందాలు నింపుకున్న లోకంలో
అనవరతం ప్రేమై శ్వాసించనీ హృదయాన్ని
ప్రేమలేని మనసుల్నీ.. ప్రేమించనీ
చెవులకు నిశ్శబ్ద నిలయాల్లో ..
పారవశ్యపు పదనిసనలను వినిపించనీ
సాయాన్ని స్పృశించనీ చేతులను.. ఆర్తిగా ప్రార్థనలో
పెదవి పలుకనప్పుడూ.. నా గళాన్ని విను
కన్నీళ్ళను నీ పెదవులతో చెరిపెయ్యరాదూ..
నా ప్రమేయం లేకుండా రాలుతున్నాయి పూలై
పొదవిపట్టుకో నన్ను నీకు దూరంగా ఉన్నప్పుడూ.