పుట:TellakagitaM.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చార్మినార్.. చెంపన..

ఈ మబ్బులు ఏ ఉత్పాతంలా కనిపిస్తున్నాయ్ చార్మినార్!
ఏ కారో మంటల్లో కాలి ఈ మసి మబ్బుల్ని కమ్మింది
కత్తులు తిట్టుకుంటున్నయ్ ఏమిటీ మరకలని
రాళ్ళగాజుల మండీల్లో పగిలేవి
ఏ చేతి గాజులు?

ఎలా అంటుకుందో చెమ్కీ చుక్కై నీ చెంపన మైసమ్మ
ఆడుగుదామంటే ఇప్పుడు లేదు కుంకుమిచ్చే ఆ బామ్మ
ఈ ఊర్లో గొడవలకీ అభిమతాలకీ ఏనాడూ లంకె లేదు
గుళ్ళకీ-గోపురాలకీ ఈ లెక్కల పాఠాలు ఎక్కలేదు

ఆ పక్కనే వెలిసినట్టు రంగు పూద్దామనే ఆదుర్దాలో ఒకరు
రంగు వెలిసినట్టు చూద్దామని వేరొకరు



రాలుపూలనగరంలో నీ బస్తీ గరం గరం
నరం తెగే నాటకాల్లో రాలేది కసుగాయలే

జెండాలో రంగులు పైనాకిందా పడి
తెల్లదనాన్ని కుమ్ముతూ.. అబద్దాలను నమ్ముతూ..
దేవేరికి గుమ్మటాల ప్రాపు..
మతంమత్తుకు మధురసాల కైపు..
ఎవరు అద్దినా అది కృతకం అమానుషాల వికృతం
తలతిక్కనాయాళ్ళకు కేవలం నువ్వో ప్లేగు బంధానివి
భాయీ భాయీ బతుకుల్లో నలిగే అలాయి-బలాయి కానుకవి
(హైద్రాబాద్ పాతబస్తీలో ఓ కొత్త కథ విని..)