పుట:TellakagitaM.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చావువార్త చదవాలని లేదు

పేపర్లో చావువార్త చదవాలని లేదు
(నిద్ర) లేస్తూనే నిట్టూర్పుల జట్టు కట్టాలని లేదు

ఉన్మాదం ఉద్రేకం నైరాశ్యం నీడలోన
రేపటి రోజుల వెలుగులని వీడాలని లేదు

చిక్కబెట్టు మనసుని, చెదిరితే చావే సాంత్వనా?
జగతి ముందు యువతని బేజారుగ చూడాలనిలేదు

పంచుకున్న ప్రేమల్లో, ఎంచుకున్న చదువుల్లో చెలికాడా!!
ఆటనాపి మడమతిప్పు తలపుల తనువులను తడమాలని లేదు

కారకాలు కోరికలు తీరనివి ఎన్నున్నా
తిరిగిరాని తీరాలకు తరలి పోవాలని లేదు లేదు!

వొప్పుకోకు ఓటమినీ నీ బాట ఎలా అవుతుందది?
పడిన చోటే జారుకుంటూ నిలవాలని లేదు

జీవితం పాలపొంగు.. నీతో నిలచిన వారే ఆస్తి
నింగి తాకు జువ్వలాగ ఎగిరి నేల వాలాలని లేదు

ఎందుకు యశస్వీ! నీకు ఎగసే కెరటం తీరుగ
పడిపోయినా చెడిపోయినా వీడిపోవాలని లేదు?

పేపర్లో చావువార్త చదవాలని లేదు
శోకంలో నేడువున్నా..
రేపటిరోజుల వెలుతురును వదలాలని లేదు
పేపర్లో చావువార్త చదవాలని లేదు
(వార్తను హత్తుకునే పర్యావరణం నాది.. )