పుట:Tatwamula vivaramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అను సూత్రము మాకు బాగా తెలుసు. నుక ఆ సూత్రమును అనుసరించి ఎంత కష్టముగ కనిపించిన తత్త్వమునకైన సులభముగ వివరమును వ్రాయగలిగాము. ఈ మావ్రాతతో అవసానదశలో మరణశయ్యపైనున్న తత్త్వములు క్రొత్తగ యవ్వనరూపముపొంది అందరిని ఆకర్షించగలవని అనుకొంటున్నాము. ఈ తత్త్వాలను మీరు చదివి తత్త్వములు ఇటువంటి వని, దేవుని దగ్గర చేర్చునవని, ఇతరులకు తెల్పుటవలన మీరు కూడ దేవుని సేవలో పాలుపంచుకొన్నవారగుదురు. లాభాలు రావాలని మొక్కి అక్రమార్జనలచే హుండీలలో లక్షలు వేసివచ్చిన ఏమాత్రము ఉపయోగము లేదు. నీకున్న స్థోమతతో కొన్ని పుస్తకములనుకొని ఆసక్తియున్నవారికి దానము చేస్తే జ్ఞానదానమగును. దానివలన విశేషమైన ఫలితము నీకు తెలియకుండనే చేరును. దేవుడుకాని దేవుల్లకు డబ్బులు వృథాగా ధారపోయుటకంటే దైవ స్వరూపములై, దైవజ్ఞానము నింపాదిగ అందించు పుస్తకములను ఇతరులకు దానము చేయుట వలన దేవుని పని ఎంతో చేసినట్లగును. ఇదే విషయమునే భగవద్గీతలో "మదర్థమపి కర్మాణి కుర్వాన్‌ సిద్ది మవాప్యసి" అన్నారు. నాకొరకు పని చేసితే నీకు సిద్ది లభించగలదని దీని అర్థము. ఇప్పటినుండైన నిజమైన దేవుని సేవ చేయమని, తత్త్వాలలోని రహస్యములను తెలుసుకోమని తెలుపుచు ముగించుచున్నాము.

ఇట్లు

ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు

-***-