పుట:Tatwamula vivaramu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానుల సంఖ్య తక్కువ. అజ్ఞానులకు జ్ఞానులు ఎప్పుడు భయపడుచునే ఉందురు. జ్ఞానులను లేకుండ చేయాలని అజ్ఞానులు చూస్తునే ఉందురు. తమకు ఆటంకము చేయు అజ్ఞానులు జ్ఞానులుగ మారిపోతే మంచిదని జ్ఞానులు అనుకొనుచుందురు. ఎప్పుడైన ఒక గొప్ప అజ్ఞాని జ్ఞానముచేత మార్చబడి, అజ్ఞానిగ లేకుండ మారిపోయాడంటే ఆ వార్త సుజ్ఞానులకు సంతోషమును కల్గించేదే అగును. అందువలన సాధు జంతువులైన మేకవలెనున్న జ్ఞాని పులిలాంటి అజ్ఞాని నాశనమయ్యాడంటే, జ్ఞానిగా మారాడంటే సంతోషపడునని చెప్పడమే ఈ చరణములో ఆ వార్త తెలిసి మేక యొకటి పకపక నవ్వేరా అన్నారు.

-***-


---------------నా చివరి మాట----------------


నేటి సమాజములో తత్త్వములు అనువాటికి ఏమాత్రము విలువ లేకుండపోయినది. భిక్షగాల్లు తామ భిక్షాటలో పాడుకొనుట మేము చిన్నతనములో చూచాము. ఇప్పటి కాలములో భిక్షగాల్లు కూడ భక్తిరూపములోనున్న సినిమా పాటలు పాడుచున్నారు. తత్త్వములను పాడు భిక్షగాల్లు కూడ చాలా అరుదుగా ఉన్నారు. ఉన్నవారు చనిపోతే వాటిని పాడేవారే కనిపించరనుకుంటాము. ఆత్మ జ్ఞానములో అత్యంత ఉన్నతమైన తత్త్వములు చివరకు భిక్షగాల్లపాలై చివరకు అక్కడ కూడ లేకుండ పోవు స్థితికి చేరుకొన్నవని చెప్పవచ్చును. ఇకపోతే బ్రహ్మముగారి మఠమువారు కొన్ని తత్త్వములను అవియు బ్రహ్మముగారి పేరున్న వాటని కొంత ప్రచారములో పెట్టుకొన్నారు. అయినప్పటికి అవి అందరికి