పుట:Tatwamula vivaramu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానికి మా జవాబు ఏమనగా! ఇంద్రియములకు సంబంధించిన ఒక్క విషయము మీద ధ్యాసపెట్టి జపించడము వలన అతడు అనేకము నుండి ఏకములోని వచ్చి మనస్సును ఒక్క దానిమీద పెట్టాడు కావున అది యోగము కానేరదు. మనస్సుకు ఏక విషయము కూడ లేకుండ చేసి ఏకము విూదగల సున్న విూదికి పోయినపుడు ఏకాగ్రత చెందిన వాడగును. అపుడు అతని మనస్సులో ఒకటి కూడ లేకుండ సున్న స్థితిలో ఉన్నాడని తెలియుచున్నది. ఏకాగ్రత చెందినవాడే బ్రహ్మయోగి అగును. అట్లుకాక మనస్సులో ఏదో ఒక దానిని ధ్యానించువాడు ధ్యాని లేక తపస్వి అగును, కాని యోగి కాలేడు. ఒక్క దానిని తపించుచు జపించు వానిని తపస్వి అంటారు. తపస్వికంటే ఏ ఒక్కటిలేని యోగి గొప్ప అని గీతలో కూడ "తపస్వి భ్యోధికో యోగీ" అన్నారు.


గొడ్డురాలువలెవున్న అజ్ఞాని జ్ఞానమను గర్భము ధరించి బ్రహ్మయోగమను పుత్రుని కన్న తర్వాత ఎట్లుండుననగా! తాను యోగము నాశ్రయించి బ్రతుకుటకు మొదలు పెట్టును. బ్రహ్మయోగము చేయునపుడు శరీరములోని మనస్సు అన్ని పనులను వదలి ఏ ఒక్క ఆలోచనగాని ధ్యాసగాని లేకుండ ఉండును. అపుడు శరీరములో ఏడు నాడీకేంద్రములందున్న శక్తి క్రింది కేంద్రమునుండి స్థంభించిపోవుటకు ఆరంభించును. ఒకదాని తర్వాత ఒకటి స్థంభించి చివరకు ఆరు కేంద్రములు నిలచిపోవును. చివరి ఏడవకేంద్రములో ఆత్మశక్తంతయు కేంద్రీకృతమైపోవును. ఏడవకేంద్రము క్రింది ఆరు కేంద్రములవలె నిలిచి పోదని జ్ఞాపకముంచుకోవలెను. పైన శిరస్సులోగల ఏడవ కేంద్రములో ఆత్మ నిలచిపోయినపుడే పూర్తి యోగమగును. క్రింది ఆరు నాడీ కేంద్రములలో ఆత్మ చైతన్యము లేకుండ పోయినది కావున శరీరములోని