పుట:Tatwamula vivaramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండవచ్చును. చిన్న గుడిసెకైతే ఒక వాకిలి ఉంటుంది. పెద్ద మేడలకైతే ఇరువై లేక ముప్పై వరకు ఎన్నైన ఉండవచ్చును. గృహములన్నియు వానివాని కర్మానుసారము ఉండునని చెప్పవచ్చును. ఆధ్యాత్మిక విద్యలో ఆత్మల వివరమే చెప్పబడుచున్నది, కావున ఇక్కడ జీవాత్మ వివరమునే మనము ప్రస్తావించుకోవాలి.


మనిషికి గృహమెలాగలదో జీవాత్మకు కూడ గృహము కలదు. అదియే శరీర గృహము. మనుషులు నిర్మించుకొన్నవి బయటికి మిద్దెలు మేడలైతే, దేవుడు నిర్మించి ఇచ్చిన గృహము శరీరము. బయటి ఇంటికి వాకిల్లు ఎన్నైన మనము పెట్టుకోవచ్చును గాని దేవుడు ఇచ్చిన శరీర గృహమునకు కేవలము తొమ్మిది వాకిల్లు మాత్రము తప్పక ఉండును. జీవాత్మ శరీరమను గృహములో కొంతకాలము నివాసము చేసి ఆ శరీర గృహమును వదలి పోవడము కూడ జరుగుచున్నది. మనము నిర్మించుకొన్న బయటి గృహము కొంతకాలమునకు శిథిలమై నివాస యోగ్యముకానట్లు శరీరగృహము కూడ శిథిలమై పోవుచున్నది. జీవాత్మ శిథిలమైన శరీరమును వదలి మరొక క్రొత్త శరీర గృహములో చేరుచున్నాడు. మొట్టమొదట జీవాత్మ పరమాత్మ నుండి వచ్చినదే. అలా వచ్చిన జీవాత్మ నివశించుటకు శరీరము తప్పనిసరి అయినది. మొదట పరమాత్మనుండి వచ్చిన జీవాత్మ తర్వాత శరీర గృహములు మారుచు భూమి మీదనే ఉండిపోయినది. ఈ తత్త్వములో జీవాత్మకు కావలసిన జ్ఞానమును చెప్పుచు తొమ్మిది వాకిల్లకొంపకు ఎందుండి వస్తివని ప్రశ్నించారు. తర్వాత ఎన్ని శరీరములు మారిన మొదటి పరమాత్మలోనికి పొమ్మని చెప్పుచు ఎందుతిరిగిన ముందు చోటికే పొమ్మన్నాడు. గురువు శిష్యునకు బోధించవలసినది ఆత్మజ్ఞానము కావున