పుట:Tatwamula vivaramu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచి గుణములుగ ఉన్నవి. ఆరు చెడు గుణములు వరుసగ 1) కామ (ఆశ) 2) క్రోధ (కోపము) 3) లోభ (పిచునారితనము) 4) మోహ (నాది, నావారు) 5) మధ ( గర్వము) 6) మత్సర (అసూయ). ఈ ఆరు గుణములనే మనిషికి శత్రువులాంటివని అరిషట్‌ వర్గము అన్నారు. అలాగే మనిషికి మిత్రునిలాంటి మంచి గుణములు కూడ ఆరు గలవు. అవి వరుసగ 1) దాన 2) దయ 3) ఔధార్య 4) వైరాగ్య 5) వినయ 6) ప్రేమ అనునవి. ఈ గుణములను బట్టి మనిషి సమాజములో మంచివాడని లేక చెడ్డవాడని లెక్కించబడుచున్నాడు. ఈ గుణముల వలననే పాపము పుణ్యములను కర్మలు కలుగుచున్నవి. మాయ యొక్క రెండు రకముల గుణములు జీవునకు కర్మలను అంటగట్టి జన్మను కలుగజేయునవే. కనుక కర్మలను బంధనములు అన్నారు. మాయకు వ్యతిరేఖము దైవము. మాయయొక్క గుణములకు వ్యతిరేఖము దైవము యొక్క జ్ఞానము. గుణములచేత తయారగు కర్మలకు వ్యతిరేఖము జ్ఞానము వలన తయారైన జ్ఞానాగ్ని. అందువలన మనషి దైవజ్ఞానమును తెలిసి జ్ఞానాగ్నిని సంపాదించుకొంటే మాయ గుణముల ప్రభావమైన కర్మ కాలిపోవునని తెలుపుచు ఆరును, ఆరును చేరకయుండమన్నాడని వ్రాశారు.


 2. తొమ్మిది వాకిల్ల కొంపకు ఎందుండి వస్తినన్నాడే
ఎందుతిరిగినా ముందు చోటికే పొమ్మన్నాడే ||శ్రీ గురు||

మనము నివశించుదానిని ఇల్లు లేక గృహము అంటాము. మనిషి తన ఆర్థిక స్థోమతను బట్టి పూరిగుడిసెనుండి పెద్దమేడలలో వరకు నివశిస్తున్నాడు. మనిషి ఎటువంటి ఇంటిలో నివశించినప్పటికి ఆ ఇంటికి ఒక ద్వారము (వాకిలి) నుండి అనేక ద్వారముల వరకు