పుట:Tatwamula vivaramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన శరీరములో దేవుడు నివశిస్తున్నాడు కావున శరీరమును దేవాలయము అన్నాము. దేవాలయమునందు గర్భగుడిలో భగవంతుని ప్రతిమ ఉన్నప్పటికి దాని చుట్టు వికృతాకారములో ఉన్న సింహ తలాటము లేక ప్రభావలి అనునది తప్పకయుండును. అదే విధముగనే శరీరములో దేవుడున్నప్పటికి మాయ కూడ కలదు. దేవుడు ఆత్మరూపములో ఉంటూ శరీరమును నడుపు శక్తిగ శరీరమంత వ్యాపించి ఉండగ, మాయ గుణముల రూపముతో తలయందు గలదు. మనిషి తలయందు గల గుణములను మాయజనితములని లేక మాయయుక్తములని చెప్పవచ్చును. అందువలన భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు " గుణమయీ మమ మాయా " అన్నాడు. దీని ప్రకారము మాయ ప్రతి శరీరములోను గుణముల రూపములో ఉన్నదని తెలియుచున్నది. గుణములు లేనివాడు ఎవడు లేడు, కావున మాయలో లేనివాడు ఎవడు లేడనియే చెప్పవచ్చును. మనిషి తలలోని మాయ యొక్క స్థానము ఎక్కడున్నదని పరిశీలించి చూచితే, తలలో సూక్ష్మరూపముగ ఉన్న నాలుగు చక్రములో క్రింది చక్రమైన గుణచక్రములో సాత్విక, రాజస, తామసమను మూడు భాగములు గలవు. ఆ భాగములలో ఒక్కొక్క భాగమునందు ఆరు ఒక రకము, ఆరు మరొక రకము మొత్తము పండ్రెండు గుణములు గలవు. ఈ రెండు రకములైన గుణములను జయించగలిగితే మాయను జయించి నట్లగును. అందువలన పై చరణములో ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే అని వర్ణించి చెప్పారు.


మాయ గుణమయమైయుండినప్పటికి ఆరు ఒక రకము ఆరు మరొక రకమైన గుణములుగ ఉన్నదని చెప్పుకొన్నాము. ఆరు మరియు ఆరు వివరమును పరిశీలించి చూచితే ఆరు చెడు గుణములు, ఆరు