పుట:Tatwamula vivaramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుట్టిన వృక్షమని అన్నారు. దానినే ఆది ద్వయంబు వృక్షము అన్నారు. శ్వాస లోపలికి బయటికి చలించడములో రెండు శబ్దములు పుట్టుచున్నవి. అవి సో, హం అను శబ్దములు, శ్వాస వలన కలుగు శబ్దములు కావున విూదటి రెండక్షరములని అని అన్నారు. లోపలికి పోవునపుడు ఒక శబ్దము బయటికి వచ్చునపుడొక శబ్దము పుట్టుచు ప్రత్యేకత కల్గియున్నవి. లోపలికి పోవు "సో" శబ్దమును బయటికి వచ్చు "హం" శబ్దములను రెండిటిని కలిసి చూస్తే '"ఓం" అను శబ్దము పుట్టుచున్నది. మొదటిదైన సో శబ్దములో 'ఓ' శబ్దము చివరిగ వినిపిస్తున్నది. అలాగే రెండవదైన హం శబ్దములో "మ్‌" శబ్దము వినిపిస్తున్నది. రెండిటిని కలిపితే ఓం అను శబ్దము తయారగుచున్నది. కావున ఆదియు అంత్యము కూడిన అని మూడవ చరణములో అన్నారు. ప్రతి జీవరాసి శరీరములోను శ్వాసలో "ఓమ్‌" అను శబ్దము ఇమిడి ఉన్నది. ఆధ్యాత్మికములో అత్యంత ప్రాముఖ్యమైనది కావున వేద వేద్యులకు వేదాంతమని చెప్పారు.

-***-


--------------11. తత్త్వము--------------


శ్రీ గురు రాయుడు మాయమర్మము తెలిపినాడే
మాయలో ఉంటూ లేనివాడు కమ్మన్నాడే


 1) ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే
ఆరును ఆరును చేరక ఉండమన్నాడే || శ్రీ గురు ||

 2) తొమ్మిది వాకిల్ల కొంపకు ఎందుండి వస్తివన్నాడే
ఎందు తిరిగినా ముందుచోటుకే పొమ్మన్నాడే || శ్రీ గురు ||

 3) ఆరు శిఖరములపైన వెయ్యికాల్ల మంటపమన్నాడే
ఆరు శిఖరముల ఎక్కి ఎగచూడమన్నాడే || శ్రీ గురు ||