పుట:Tatwamula vivaramu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచయిత ప్రబోధానంద యోగీశ్వరుల ముందుమాట


తత్‌ అనగ అది అని అర్థము. త్త్వం అనగ నేను అని అర్థము. తత్త్వం అనగ అది నేను అని చెప్పవచ్చును. నేను అనువాడు జీవుడు, జీవునికంటే వేరుగ ప్రక్కనే ఉన్నవాడు ఆత్మ (దేవుడు). జీవాత్మ ఆత్మల వివరమే తత్త్వములో ఉండును. జీవాత్మ, ఆత్మల వివరములేనిది తత్త్వము కానే కాదని చెప్పవచ్చును. తత్త్వ జ్ఞానము చాలా విలువైనది. ఆత్మ, జీవాత్మలు శరీరములోనే ఉండును. కావున తత్త్వ వివరమంతయు శరీరములోనే ఇమిడివుండును. అందువలన తత్త్వ వివరము తెలుపువారు శరీరములోపలే చెప్పాలి. శరీరము విడిచి బయట చెప్పితే అది పూర్తి అసత్యమగును.


అసలు విషయమేమంటే "తత్త్వం" అని పేరు పెట్టిన పాటలుకాని, పద్యములుకాని ఎవరికి అర్థముకాని రీతిలో ఉంటాయి. ఎవరైన తత్త్వము వ్రాస్తే అలాగే వ్రాయాలని ఆనాటి పెద్దలు నిర్ణయించుకొని తీర్మానించారు. ఆ పద్ధతి ప్రకారమే తత్త్వాలన్నీ వ్రాయబడినవి. అలా అర్థముకాని రీతిలో ఎందుకు వ్రాయాలి అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా? మన పెద్దలు కొంత ధనమును సంపాదించారు అనుకొందాము. ధన సంపాదన వెనుక ఎంతో శ్రమ ఉండును. శ్రమపడి సంపాదించినది కావున ఆ ధనమునకు కూడ ఎంతో విలువ ఉండును. దాని విలువను గుర్తించిన వారు ధనమును ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెకు ఒక తాళము కూడ వేసి ఉందురు. లోపలి ధనము కావాలంటే తాళమును తెరచు తాళముచెవి కావాలి. అలా ఉన్నపుడే ధనమునకు విలువవుండును. ఎదుటివాడు దాని విలువను తెలుసుకొనును. అలా లేకపోతే ధనము ఆరుబయట ఉంటే దాని విలువను గుర్తించలేరు. ఇష్టమొచ్చినట్లు వాడుకొని అసలే లేకుండ చేసుకొందురు. పూర్వము పెద్దలు జ్ఞానమను ధనమును సంపాదించి ప్రపంచ ధనమును దాచినట్లు పెట్టెలో పెట్టి తాళము వేయలేదు. కాని ఒక గుడ్డలో మూటగట్టి ముడివేశారు. ఆ మూటలను మన ఎదుటే పెట్టి పోయారు. ఆ మూటల ముడి విప్పితే అందులోని జ్ఞానధనము సులభముగ దొరుకును. మూటలు