పుట:Tatwamula vivaramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

-------------6. తత్త్వము--------------


చిల్లర రాళ్ళకు మ్రొక్కుచువుంటే చిత్తము చెడునుర ఒరేయొరే
చిత్తమునందు చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే ||చి||


1. ఒక్క ప్రొద్దులని ఎంచుచుయుంటే ఒనరుగ చెడుదువు ఒరేయొరే
ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే ||చి||

2. నీల్లలో మునిగి గొనుగుచుయుంటే నిలకడ చెడునుర ఒరే యొరే
నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచునుండుట సరే సరే ||చి||

3. బాధ గురువుల పంచను జేరితే భావము చెడునుర ఒరే యొరే
భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే ||చి||

4. భూములు అడవులు తిరుగుచునుంటే బుద్దులు చెడునుర ఒరేయొరే
బుద్దిలోయుంటే పున్నమిచంద్రుని చూచుచునుండుట సరే సరే ||చి||

5. వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితె వివరము తెలియును ఒరేయొరే
వివరమందుండె విగ్రహమూర్తిని చూచుచునుండుట సరే సరే ||చి||


వివరము : 5160 సంవత్సరముల పూర్వము చెప్పిన ఇందూమత గ్రంథమైన భగవద్గీతలోను, 2005 సంవత్సరముల పూర్వము చెప్పిన క్రైస్తవ మతగ్రంథమైన బైబిలులోను మరియు దాదాపు 1420 సంవత్సరముల పూర్వము చెప్పిన ఇస్లామ్‌ మతగ్రంథమైన ఖురాన్‌లోను ఏకేశ్వరోపాసన చెప్పబడినది. అందరికంటే మించిన దేవుడొకడున్నాడని, అతనినే ఆరాధించవలెనని మత గ్రంథములన్నియు ఘోషిస్తున్నవి. అయినప్పటికి మానవులు అందరికంటే గొప్పవాడైన పరమాత్మను ఆరాధించక అన్యదేవతారాధనలలో మునిగిపోయారు. అసలైన దేవున్ని మరచి చిల్లర దేవుల్లను మ్రొక్కను మొదలు పెట్టారు. అందరిలోను,