పుట:Tatwamula vivaramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరముల ద్వార ప్రాకి శరీరమును చైతన్యవంతముచేసి కదలించుచున్నది. బ్రహ్మనాడిలోని ఆత్మ ఆరు కేంద్రములనుండి శరీరమంత వ్యాపించి ఉన్నది. ఈ విషయమును తెలియజేస్తు ఆరుచక్రముల ఆవల ఈవల లోపల వెలుపల అన్నారు. పైన ఏడవకేంద్రము నుండి క్రింది కేంద్రములకు వ్యాపించి యున్నది కావున ఆరుచక్రముల పెనుచుక పాము అదోముఖంబై ఓరన్నా అని మూడవచరణములో అన్నారు. ఈ తత్త్వములో ఆత్మ వెన్నుపాములో పై నుండి క్రిందికి వ్యాపించి ఆరు కేంద్రముల ద్వార శరీరమంతటిని కదలించుచున్నదని, శరీరములోని ఊపరితిత్తుల ద్వార శ్వాసను ఏర్పరచినదని తెలియుచున్నది. శరీరములో తెలియక కనబడకయున్న ఆత్మను మనోధ్యాస ద్వార తెలుసుకోవచ్చునని కూడ పై తత్త్వములో తెలిపారు. కొలిమితిత్తులవలె శరీరములోని ఊపిరితిత్తులు గలవు కావున వాటిని ఊదేతిత్తులు అన్నారు. ఊదేతిత్తుల ద్వార శ్వాసను ఎల్లపుడు ఊదువాడు వెన్నుపాములోని ఆత్మని తెలియబడినది.

-***-


-------------5. తత్త్వము------------


ఈ జన్మమిక దుర్లభమురా ఓరీ సాజన్మ సాకార సద్గురుని కనరా ||ఈ జన్మ||


1. పంచాక్షరి మంత్రము పఠన చేయరన్న
పఠన చేసిన యముడు పారిపోవునన్నా,
పారిపోతే అంబఫలమిచ్చునన్న
ఫలమునందిన వాడు పరమగురుడన్నా ||ఈ జన్మ||

2. మూడారు వాకిల్లు మూయవలెనన్న
ముక్తివాకిట నిలచి తలుపు తీయన్నా
తలుపు తీసిన అంబతేజమిచ్చన్న
తేజమందినవాడు తాగురుడోయన్నా ||ఈ జన్మ||