పుట:Tatwamula vivaramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసుకోవడమును తోక నాలుక అనడమైనది. అన్ని ఆలోచనలను లేకుండ చేసుకుంటే ఆత్మ తొందరగ తెలియును. పాము భూమి విూద పడుకొనియున్నపుడు కనిపించకుండ ఉండును. పైకిలేచి పడగెత్తితే అంతకు కనిపించని పాము కనిపించును. ఆలోచనలు అనచినపుడు యోగమునకు ఆత్మ పైకిలేచిన పాము తెలిసినట్లు తెలియగలదని మొదటిచరణములో చెప్పారు.


2) శంకుచక్రముల నట్టనడుమ ఆది శేషుని లేపర ఓరన్నా - ఓంకారించుక ఉన్నది పాము కొరకక లేచుర ఓరన్నా ||ఉ||

శరీరములో వెన్నుపాము అను నరమునకు కుడి ఎడమగ రెండు నరములు గలవు. వెన్నుపామును బ్రహ్మనాడి అని అనుచు కుడి ఎడమగవున్న రెండు నాడులను సూర్యచంద్రనాడులు అంటున్నారు. సూర్యచంద్రనాడుల నడుమయున్న వెన్నుపామును ఆదిశేషుడని పై తత్త్వములో అన్నారు. సూర్యచంద్రనాడులను శంకుచక్రములని కూడ అన్నారు. వెన్నుపాములోని ఆత్మశక్తి ఊపిరితిత్తులను కదలించుట వలన శ్వాస నడుచుచున్నది. శ్వాస నడుపునపుడు ఓంకార శబ్దము ఏర్పడు చున్నది. ఈ విషయమునే రెండవచరణములో తెలుపుచు శంకు చక్రముల నడుమను ఆదిశేషుని లేపర ఓరన్నా - ఓంకారించుకయున్నది పాము అని అన్నారు.


3) ఆరుచక్రముల కావల ఈవల లోపల వెలుపల ఓరన్నా - ఆరుచక్రముల పెనుచుక పాము అదోముఖంబై ఓరన్నా ||ఉ||

వెన్నుపాములో మొత్తము ఏడు నాడీకేంద్రములున్నవి. పైన ఏడవ నాడీకేంద్రములో ఆత్మ కేంద్రముగ ఉండి క్రింది ఆరు కేంద్రముల వరకు వ్యాపించియున్నది. క్రింద ఆరు కేంద్రములనుండి శరీరమంత