పుట:Tatwamula vivaramu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున ఆ మంత్రమును స్వయముగ ఆత్మ ధ్యానించుచున్నదని ఆ ధ్యానములో అఖండముగ అందరిలో నిలిచియున్నదని ఆరవచరణములో అన్నారు.


 7) పామును బట్టే యోగి ఎవరు చందమామ, ఓహో అతని పేరు సిద్దగురుడు చందమామ ||చం||

అటువంటి పామును అనగ ఆత్మను పొందగలిగినవాడు యోగియై సిద్ధిపొందగలడని తెలుపుచు పామును పట్టేయోగి సిద్దగురుడు అన్నారు.

-***-


--------------4. తత్త్వము-------------


ఊదేతిత్తుల పైగానుండే ఉన్నతి తెలియర ఓరన్నా- తిత్తుల నడుమను చక్షుల విూదను చీకటి కొట్టుర ఓరన్నా


1) చీకటి కొట్టును తోక నాలుక తీసుక లేపర ఓరన్నా - చిఱ్ఱున తీసుక లేపిన కాకకు పాము లేచుర ఓంరన్నా ||ఉ||


2) శంకుచక్రముల నట్టనడుమ ఆది శేషుని లేపర ఓరన్నా - ఓంకారించుక ఉన్నది పాము కొరకక లేచుర ఓరన్నా ||ఉ||


3) ఆరుచక్రముల కావల ఈవల లోపల వెలుపల ఓరన్నా - ఆరుచక్రముల పెనుచుక పాము అదోముఖంబై ఓరన్నా ||ఉ||


వివరము :- శరీరములో కుడి ఎడమగ రెండు ఊపిరితిత్తులున్నాయని అందరికి తెలుసు. రెండు తిత్తులనుండి వచ్చే ఊపిరి ముక్కు ద్వారా బయటికి వస్తున్న విషయము కూడ అందరికి తెలుసు. ఊపిరితిత్తులు కదలుతుంటేనే శ్వాస ఆడుచున్నదని కూడ అందరికి తెలియును. ఊపిరి తిత్తులు ఎలా కదులుచున్నవి, వాటిని ఎవరు కదలించుచున్నారన్న