పుట:Tatwamula vivaramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్ని శరీరములలో ఆత్మ తెలియకుండ నివాసము చేయున్నది. కావున దేహదేహములందు పాము తెలియకుండ చుట్టుకొన్నది అని ఐదవ చరణములో అన్నారు.


 6) అజప మంత్ర ద్యానము చేత చందమామ, పాము అఖండ కళలతో వెలుగుచునుండు చందమామ ||చం||

మన శరీరములో ఆడుచున్న శ్వాసయందు ఒక శబ్దము కలదు. శ్వాస ముక్కురంధ్రముల ద్వార లోపలికి పోవునపుడు "సో" అను శబ్దముతో పోవుచున్నది. బయటికి వచ్చునపుడు "హమ్‌" అను శబ్దముతో వచ్చు చున్నది. శ్వాస ఒకమారు లోపలికిపోయి బయటికి రావడములో "సోహమ్‌" అను శబ్దము ఏర్పడుచున్నది. ఈ సోహమ్‌ శబ్దములో "ఓం" శబ్దము ఇమిడి ఉన్నది. అదేవిధముగ అనగ లోపలికి పోవునపుడు 'సో' అను శబ్దముతో పోవుచున్నది కదా! 'సో' అను శబ్దములో చివరిగ 'ఓ' అను శబ్దము వచ్చుచున్నది. అట్లే శ్వాస లోపలినుండి బయటికి వచ్చునపుడు 'హమ్‌' అను శబ్దముతో వచ్చుచున్నది కదా! 'హమ్‌' అను శబ్దములో చివరిగ 'మ్‌' అను శబ్దము వచ్చుచున్నది. శ్వాస లోపలికి పోవునపుడు చివరిగ వచ్చు 'ఓ' అను శబ్దమును, శ్వాస బయటికి వచ్చునపుడు చివరిగ వచ్చు 'మ్‌' శబ్దమును కలిపితే 'ఓమ్‌' అగుచున్నది. ఒక్కమారు శ్వాసలోపలికి పోయి బయటికివస్తే అందులో 'ఓమ్‌' కారము ఇమిడియున్నది. శ్వాస ప్రతినిత్యము ఎల్లవేళల ఆడుచున్నది కావున 'ఓమ్‌' శబ్దము ఎల్లవేళల మనయందు జపించపడుచున్నది. మనము ప్రయత్న పూర్వకముగ జపించకనే తానంతటికదే జపించ పడుచున్నది కావున ఓంకారమును అజపమంత్రము అన్నారు. ముక్కు రంధ్రములలో జపించబడుచున్న 'ఓమ్‌' శబ్దము ఎల్లపుడు అఖండముగ సాగుచున్నది