పుట:Tatwamula vivaramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు రెండు మూడుమార్లు శ్వాసను పీల్చి ఉదరమునందు ఊపిరి తిత్తులందును గాలిని భర్తిగా చేసుకొని బయటికి వదలక ప్రయత్న పూర్వకముగా భిగించి ఉండును. దీనినే "కుంభకము" అని అందురు. ఈ విధముగా కుంభింపబడిన గాలి బంతియందు బంధింపబడి ఉన్నట్లుండును.


1) గాలిని ఆధారము చేసుకొని ఆడుచున్న ఊపిరితిత్తులు గాలి కదలక నిలిచిన వెంటనే నిలిచిపోవుచున్నవి.

2) ఊపిరితిత్తులు నిలిచిన వెంటనే ఊపిరితిత్తులను నడుపుచున్న నరము లందు చైతన్యము కూడ నిలిచిపోవును.

3) నరములందు చైతన్యము నిలిచిన వెంటనే ఆ నరములతో సంబంధమున్న సూర్యచంద్రనాడులందుండు చైతన్యము నిలిచిపోవును.

4) సూర్యచంద్రనాడులందు చైతన్యము నిలిచిన వెంటనే సూర్యచంద్ర నాడులను ఆధారముగా చేసుకొని చలించుచున్న మనస్సు కదలక నిలిచిపోవును.

5) మనస్సు నిలిచిపోయిన వెంటనే మనస్సును ఆధారముగా చేసుకొని జీవులను నడుపుచున్న ఆరు కేంద్రములలో చైతన్యశక్తి నిలిచిపోవును. అనగా కుండలీశక్తి ఆటకట్టబడినదన్నమాట. నరకేంద్రముల చైతన్యము నకు ఆధారమై ఉన్న ఏడవ కేంద్రము ఒక్కటి తన శక్తిని కోల్పోక ఉండును. ఆరు కేంద్రముల చైతన్యశక్తి నిలిచిపోయినను ఏడవ కేంద్రమందున్న చైతన్యశక్తి నిలిచిపోక ఉండును. ఏడవ కేంద్రమందలి శక్తి అపారమైనది, ఊహించరానిది, చెప్పుటకు శక్యముకానిది, దానినే ఆత్మ అని యోగులు అంటున్నారు. ఈ ఏడవ కేంద్రమునందలి చైతన్యము జీవుని నిదుర, మెలుకువ, స్వప్నములందు సమానముగ ఉండును