పుట:Tatwamula vivaramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4) ఏటివిూద స్వాతికొంగ వేటలాడుచురాగ చాటునున్న విూనుపిల్ల అట్టే మ్రింగె "ఆహా"


5) చెప్పినాడు వీరదాసు చోద్యముగాను ఆత్మతత్త్వము గొప్పవారు దీని భావము విప్పిచెప్పితే చాలు "ఆహా"


దీని అర్థమేమనగా :- శ్వాసను కుంభించి నిలిపి మనస్సును బ్రహ్మనాడి యందు చేర్చ వలయునని అనుకొన్న యోగి ఒక స్థలమునందు కదలక కూర్చొని మొదట శ్వాసను ఊపిరితిత్తులనిండా ఏమాత్రము ఖాళీ లేకుండ పీల్చును. పీల్చిన శ్వాసను ఏమాత్రము బయటికి వదలకుండ మూడు లేక నాలుగు నిమిషములుండును. ఇట్లున్న తర్వాత మరియు బయటి గాలినే లోపలికి పీల్చును. ఇక్కడ గమనింపవలసిన విషయము మొదట ఊపిరితిత్తులు ఏమాత్రము ఖాళీ లేకుండ గాలి పీల్చినాడుకదా ఖాళీలేని ఊపిరితిత్తులందు తిరిగి గాలి ఎట్లు ప్రవేశించినదని అనుమానము కలుగవచ్చును. దానికి సమాధానము మొదట ఖాళీలేని ఊపిరితిత్తులందు మూడు నాలుగు నిమిషముల తర్వాత కొద్దిగా ఖాళీ ఏర్పడియుండును. ఆ ఖాళీస్ధలము ఏట్లేర్పడినదనగా ఊపిరితిత్తులయందున్న గాలి మూడు నాలుగు నిమిషములకు బయటికి రావలయునని ప్రయత్నించును. కాని బయటికి రాకుండ నిరోధించి ఉన్నందువలన ఊపిరితిత్తులలోని మూలలకు గాలి చేరుట వలన ఊపిరితిత్తులు కొద్దిగా ఖాళీ ఏర్పడి ఉండును. ఆ ఖాళీ పూర్తి అగునట్లు రెండవసారి యోగి బయటి గాలిని పీల్చి పూరించుచున్నాడు. ఇట్లు రెండవమారు గాలిని పీల్చిన యోగి మూడు లేక నాలుగు నిమిషముల వరకు శ్వాసను బయటికి వదలక ఉండి, తర్వాత ఇంకా తనయందు గాలి ప్రవేశించునేమోనని మూడవ మారు పీల్చి చూచును. అపుడు కూడ గాలి కొద్దిగ లోపలికి పోవును.