పుట:Tatwamula vivaramu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నక్క ఒకటియని అన్నారు. ఆత్మ స్థిరస్థాయిగ ఒక్క చోటుండి తనశక్తి కిరణములను నరముల ద్వార శరీరమంత వ్యాపింపజేయుచున్నది. అందువలన పగలు రేయి స్థిరస్థాయిగ ఉన్న చుక్కగ ఆత్మను పోల్చి నక్క ఒకటుండు చుక్కవలె అన్నారు. బ్రహ్మనాడికి కొద్దిగ ముందు ప్రక్కన రెండువైపుల సూర్యచంద్రనాడులున్నాయి. జాగ్రతావస్థయందు మాత్రము మనస్సుకు స్థానమైవున్న సూర్యచంద్రనాడులను 12 గంటల కాలము కనిపించి 12 గంటల కాలము కనిపించని సూర్యచంద్రులుగ పోల్చి చుక్కకు తూర్పున సూర్యచంద్రులు తేజరిల్లుయన్నారు.


ఇది నిగూఢ భావముగల పద్యము. శరీర అంతర్గత జ్ఞానము పూర్తిగ తెలిసినవారికే ఈ పద్యము అర్థ్థమగును. శరీరాంతర్గత జ్ఞానము చాలామందికి లేనిదానివలన దీని అర్థము చెప్పుటకు చాలా కాలము పట్టునను ఉద్దేశముతో నెలలు పండ్రెండు గడువిత్తునని చెప్పారు.

-***-


-------------2. తత్త్వము-------------


ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్దమంత్రము.


1) రెక్క ముక్కులేని పక్షి రేయి పగలు తపస్సు చేసి ఒక చెరువు చేపలన్ని ఒక్కటే మ్రింగెను. "ఆహా"


2) ఇంటి వెనుక తుట్టెపురుగు ఇంటిలో అందరిని మ్రింగె, చూడవచ్చిన జనులనెల్ల చూచిమ్రింగెను. "ఆహా"


3) కాళ్లు చేతులు లేనివాడు కడవ ముంత చేత పట్టి నిండుబావి నీళ్లని ఒక్కడే ముంచెను "ఆహా"