---------------1. తత్త్వము--------------
సీ.. | కానని భూమిలో కస్తూరి కోనలో | |
తే.. | దీనికర్థంబు చెప్పు దేశికునకు | |
భావము :- దైవము నిల్వయున్న నిజమైన దేవాలయమైన మన శరీరములో, కంటికి కనిపించని చూడబడని అంతర్గతములో, ఎముకలచే మరియు వెన్నుపూసలచే పేర్చబడిన శరీర భాగములో ఎతైన కపాలస్థాన మందు జీవుల సారాంశమంతయు ఇమిడి ఉన్నది. ఆ స్థానములోనే జీవరాసుల జరిగిన, జరుగుచున్న, జరుగబోవు చరిత్రలన్ని దాచబడినవి. శిరో భాగములో మద్యనగల గుణచక్రమందు గుణములు, కర్మచక్రమందు కర్మ, కాలచక్రమందు కాలము కనిపించక సూక్ష్మముగ ఉన్నవి.
కనిపించు మెదడునుండి ఒకనాడి బయలుదేరి గుదస్థానము వరకు వ్యాపించివున్నది. దీనినే బ్రహ్మనాడి అందురు. ఈ నాడియందు కాల, కర్మ, గుణచక్రములను నడుపు ఆత్మ నివాసమై ఉన్నది. ఆత్మ