ఈ వియ్యంకులు తణుకు ప్రాంతపు శాశ్వతగుర్తులు | పెమ్మరాజు బాపిరాజు(జననం 1980), వి.వి.ఎస్.శర్మ
పెమ్మరాజు బాపిరాజు : 2-5-1980న జననం. క్షా సూరమ్మ, వెంకట సూర్య నారాయణమూర్తులు తల్లి దండ్రులు. తణుకు, అత్తిలిలలో విద్యాభ్యాసం. పత్రికా రచయిత, గ్రంథాలయోద్యమకారుడు, వక్త, ధార్మికుడు సంఘసేవకుడు. 10వ యేటనే తన స్వగ్రామం మీన విలూరులో తిక్కన గ్రంథాలయాన్ని నిర్వహించారు. గ్రామాభ్యుదయంకోసం విశేషంగా శ్రమించారు. 1950 : అక్టోబరు 20న 'జనతా గ్రంథాలయాన్ని స్థాపించారు. సోషలిస్తు దిగ్గజం 3. ఎమ్.ఎన్.రాయ్ సిద్దాంతానికి ప్రభావితులయ్యారు. కరణంగా, మునసబుగా, గ్రామపరిపాలనాధి కారిగా సేవలు అందించారు. బల్లిపాడు శ్రీ మదనగోపాల స్వామి దేవస్థానం ధర్మకర్తగా ఉన్నారు. మీనవిలూరులో హరిజనులకు నివాస |స్థలాలపంపిణీలో స్వంతభూమి ఐదు ఎకరాలను ప్రదానంచేసారు. 1983, 1986, 1989 లలో తణుకుతాలూకాలో వరద బాధితులను ఆదుకోవడంలో, వారికి పునరావాసం కల్పించడంలో అవిరళకృషి జరిపారు. శ్రీ కావలిపురపు | రామచంద్రరావు ‘శివరంజని కృతిని వీరు స్వీకరించారు. చిన్నతనంలోనే స్వతంత్రపత్రికలో ఉపసంపాదకులుగా తర్ఫీదుపొందారు. 1980 నుంచి 1996 |వరకు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలకు అత్తిలికేంద్ర జర్నలిస్తుగా పనిచేసారు. జూన్ 28న హైదరాబాద్లో మరణించారు. వరిగొండ వెంకట సుబ్రహ్మణ్యశర్మ: శ్రీ బాపిరాజు వియ్యంకుడు. తణుకు లోని తొలితరం పాత్రికేయుల్లో ఒకరు. ఆంధ్రప్రభకు తణుకుకేంద్ర విలేఖరిగా చాలాకాలమున్నారు. ముక్కుసూటి మనస్తత్వం. సి.పి.ఎం. పార్టీలో క్రియాశీలక సభ్యులు. సి.పి.ఎం. తణుకు తాలూకా తొలికమిటీలో ఉన్నారు. తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్టీస్కి వీరు తొలి ఉపాధ్యక్షులు. వరిగొండ కాశీవిశ్వేశ్వరరావు : వీరు శర్మగారి కుమారుడు. |సీనియర్ పాత్రికేయుడు. పత్రికారంగంలో వివిధహోదాల్లో |పనిచేస్తూ కీర్తిప్రతిష్టలార్జించారు. శ్రీ బాపిరాజు ఈయనకి పిల్లనిచ్చిన మామగారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం.
- * *
inm - -ܠ