Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిరూపించారు. ప్రోలనాడు నిర్ణయంచేసారు. పానారసీమలోని అనేక దేవాలయా | లపై వీరు పరిశోధనాత్మక గ్రంథాలు వ్రాశారు. అయితే వీరు రచించిన అనేక | గ్రంథాలు చెదలపాలయ్యాయి. తణుకు సమీప 'అన్నవరప్పాడు, 'వడలి' గ్రామాలపై, ఆయా గ్రామదేవతలపై వీరు చేసిన కృషి చెప్పకోదగింది. తురగావారు జననాథపురం- జగన్నాథపురం- వేంగీ రాజధానిగా| నిరూపించారు. 'భారతి' పత్రికాముఖంగా వీరు వెలువరించిన అనేక చారిత్రక | పరిశోధనావ్యాసాలు ఆనాటి రోజులలో పండిత, పరిశోధకవర్గాలలో తీవ్రస్థాయి చర్చను లేవనెత్తాయి. తురగావారు భౌతికమైన ఫలాలు ఏమీ ఆశించకుండా ఐదుశతాబ్దాలు తన పూర్తి జీవితం శాసనపరిశోధనలో గడిపారు. కొందరు, | వీరిని, చారిత్రక పరిశోధనారంగంలో తలపండిన వారుగా చెప్పదగిన మల్లంపల్లి సోమశేఖరశర్మ గారికి సములని, అయితే, వారికి దొరికిన గుర్తింపు, ఖ్యాతి వీరికిదక్కలేదనీ అభిప్రాయపడతారు. s 'కళాప్రపూర్ణ పండిత పెన్మెత్స సత్యనారాయణరాజు, తన జీవితసర్వసం శాసన పరిశోధనలో గడిపిన శ్రీ కృష్ణమూర్తిని ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళా | ప్రపూర్ణతో గౌరవించడం సముచితం అనీ, వీరి గ్రంథాలను హిస్టరీ ప్రధాన | విషయంగా చదివే ఎమ్.ఎ. విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేయడం విశ్వవిద్యా |లయాల కర్తవ్యమనీ వ్రాశారు. శాసన పరిశోధనారంగంలో తన జీవితాన్ని అర్పించిన తురగావారి | వంటి మహోన్నతవ్యక్తిత్వాలకు మన ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, చారిత్రక పరిశోధనాసంస్థలు ఎందుకు సముచితరీతిలో గౌరవ పురస్కారాలు అందజేయడం లేదు? ఈ ప్రశ్న మనకు కలుగకమానదు. సినీ, నాటకరంగాలకు నంది |బహుమతులు ఇస్తున్నట్లే, మన ప్రభుత్వం, మన తెలుగుజాతి చారిత్రక, సాంస్కృతిక మూలాలను వెలికితీసే కృషిచేస్తున్న పండిత పరిశోధకులకూ తగు విధంగా గౌరవ సత్కారాలు చేయగల్గితే ఎంతో బావుంటుంది. శ్రీ తురగా కృష్ణమూర్తిగారు - తణుకుపట్టణానికి చెందిన ప్రసిద్ధన్యాయ వాది కీ.శే శ్రీ బంధకవినీతారామాంజనేయులు (వీరే, శివచిదానంద భారతిగా ñóãJñðəēgaíbo fSepoleo Sopeso áboyoqpăóěKoew evatívetio)5) åògão,ñó మామగారు, వీరి మరో అల్లుడు శ్రీ గోటేటి భాస్కరమూర్తికూడా తణుకులో మరో పేరుమోసిన న్యాయవాదిగా àನಾರು. 裘梁 时