Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాజ్మయావలోకనము శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మన్ననలను పొందింది. వీరు ఆంధ్రభూమి సంపాదకత్వం వహించారు. వీరు రామలింగేశ్వర స్తవము', 'శంకరస్తవము', 'లలితా సుప్రభాతము', 'ఆత్మపుష్పాంజలి", "సేవా సదనము, తెలుగు బిడ్డలు, వీరవనితలు, వేమనపద్యాలకు వేదాంతార్థాలు, |'ఆంధ్ర రమణీమణులు(2భాగాలు), కేయూరబాహు చరిత్ర, 'ఆంధ్రరాజభక్తులు, |'ఆంధ్ర విదుషీమణులు', 'ఆంధ్రవీర యువకులు', 'రాణాప్రతాపసింహ, “వదినె, "భక్తనంద’, 'దుర్గావతి, 'వాణిజ్యపూజ్యలు, 'ఆకుకూరలు', 'కాయకూరలు' |'దుంపకూరలు వీరి రచనలు. వీరి 'ఆంధ్ర సారస్వత వ్యాసావళి పండిత, |పామరజనరంజకమైనది. వీరి 'రాణాప్రతాపసింహ, చక్కని శైలికి రమణీయంగా కూర్చిన సంఘటనా చిత్రణకూ పేరు పొందింది. వీరి రచనలు జాతిచైతన్యానికి |దోహదం చేసే రీతిగా ఉంటాయి. నిరంతర సాహిత్యవ్యాసాంగంతో సాహితీ తపస్విగా ప్రసిద్దులయ్యారు. శ్రీ ఆండ్ర శేషగిరిరావు తణుకుకే చెందిన శ్రీ బంధకవి | సీతారామాంజనేయులు షష్ఠ్యబ్ద అభినందన సంచికకు ఇలా వ్రాసారు : శ్రేష్టత కూరుకున్న పాలగోస్తనీతీరపు పెద్దపట్టణం తణుకు. ఆ పెద్ద పట్టణపు పెద్ద న్యాయవాదులలో ఒకరికి నేను అతర్మితోపన్నంగా ఒకసారి క్లయింటును కావలసివచ్చింది. అదే మాకిద్దరికీ ప్రథమ పరిచయం. ఈ పరిచయం ఏర్పడినవారిలో నేను విశాఖపట్టణంలో - రాళ్ళ 6%ඕරසී నీళ్ళ త్రాగే ఊళ్ళి ఉంటున్నాను. అంటే పాలగోస్తనీనదితీరస్థన్యాయవాదికి రాళ్ళగోస్తనీ నదీ జలపాయి అయివున్నవ్యక్తి క్లయింటు అయ్యారన్నమాట. అయితే క్లయింటుదిన్నీ, అసల్లోనూ, అచ్చంగానూ తణుకుతాలూకాయే. విశాఖ ఉనికి తాత్కాలికం, అత్తిలి సూర్యనారాయణమూర్తి (జననం: 1908) తణుకుతాలూకా ఆరవల్లి జన్మస్థలం. భీమవరం నివాసస్థలం. 'సూర్య | నారాయణమూర్తి కథలు’(1938), ‘పాలపుంత (1939), "కుసుమాంజలి మొ||వి వీరి రచనలు. వీరి కథలు సాంఘికవాతావరణంలో ఉన్నాయి. 'పాలపుంతలో | దేశభక్తి, ప్రకృతి ఆరాధన ప్రధానం. ఈ పుస్తకం ప్రఖ్యాత అడవిబాపిరాజుగారికి అంకితం. వీరిపై కాల్పనికోద్యమప్రభావం ఉందని విమర్శకులు చెబుతారు. ప్రాచ్య, పాశ్చాత్యరీతులను అవగాహన చేసుకొన్న రచయిత ఈయన. ముళ్ళపూడి తిమ్మరాజు జమీందారుగారికి హిందీ సాహిత్యంమీద | చాలా అభిలాష లెక్కలేనన్ని హిందీ పుస్తకాలు చదవటం, వాటిని తెనిగింప |చెయ్యడం వీరికి అలవాటు. - పండిత పెన్మత్స సత్యనారాయణరాజు \UL— コ