పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తణుకు జాతీయ పాఠశాల స్థాపకులలో అగ్రగణ్యులు జగమెరిగిన జాతీయవాది మంగిపూడి పురుషోత్తమ శర్మ (1892-1946) ప.గో.జిల్లా పిప్పర స్వస్థలం. సీతమ్మ విశ్వపతి ܪ ܒܬܐ శాస్త్రిలకు జన్మించారు. జాతీయకవి వెంకటశర్మగారి |తమ్ముడు. బందరు జాతీయ కళాశాలలో మెట్రిక్యులేషన్ చదివారు. సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యులు. తన |17వ యేటనే భీష్ముని చరిత్రను వచన కావ్యంగా వ్రాశారు. కోlఇది ఆనాటి స్కూలు ఫైనల్ విద్యార్ధులకు పాఠ్య గ్రంథం. శర్మ జాతీయోద్యమ కవి, దేశభక్తులు. మహత్ముడి | |అనుచరుడు. గాంధీజీ బోధనలవల్ల సత్యాగ్రహోద్యమంలో పనిచేసి, కారాగార | శిక్షను అనుభవించారు. "స్వేచ్ఛాగానం' అనే ఖండకావ్యాన్ని రచించారు. వీరి రచనలు ఎన్నో పత్రికలలో వెలువడేవి. 1928 సం||లో మాగంటి అన్నపూర్ణాదేవి | గారిపై వ్యాసం వెలువరించారు. భీష్ముని చరిత్ర', 'కోయిలపాట', “সুলতা) || గానము', 'స్వామి దయానంద సరస్వతి జీవితము', 'గోదావరిలు వీరి రచనలు. స్వాతంత్రోద్యమంలోనే కాకుండా, జాతీయావాదిగానూ వీరి పాత్ర| అనన్యసామాన్యం. వీరు కృష్ణ, పశ్చిమగోదావరిజిల్లా ప్రజలలో దేశభక్తిని | ప్రబోధించారు. 1920లో శర్మ సహయ నిరాకరణోద్యమంలో పాల్గొని తన ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. గాంధీజీ 1929 ఏప్రిల్ 23–28 వరకు | ప.గో.జిల్లా పర్యటించినప్పడు శర్మ వారితో ఉండి, మహాత్ముడి ఉపన్యాసాలను | అనువదించారు. మహాత్ముడి ఆదేశానుసారం, 1920లో కొవ్వలి గోపాలరావు లాంటి మరెందరో మిత్రులప్రోత్సాహంతో తణుకులో 5 ఎకరాల తోటలో 60 వేలు ఖరీదు చేసే భవనంలో జాతీయ పాఠశాల ప్రారంభించారు. దీనిని “ñ°S6፰)p విద్యాపీఠం' అనే ఆశ్రమంగా మార్చాలని శర్మగారు ప్రయత్నించారు. అయితే దీనిని ఆశ్రమంగా మార్చడానికి కొవ్వలి గోపాలరావు వ్యతిరేకించారు. | స్థానిక జాతీయవాదులతో వచ్చిన ఈ విభేదాలను ఆసరాగా చేసుకుని, పట్టణంలోని న్యాయవాదులు ఈ భవనాన్ని క్లబ్బుగా వినియోగించుకోవాలను | కున్నారు. ఈ దశలో పాఠశాలకు ఆర్థిక సహయం నిలిపివేశారు. ఇలాంటి| పరిస్థితులలో తణుకు జాతీయ పాఠశాల మూసివేశారు. అయితే 1924 నుంచి| ఈ జాతీయ పాఠశాలలో 3సం||లు క్రియాత్మకంగా పనిచేయడమే శర్మ గారి జాతీయోద్యమ జీవితంలో ప్రధాన ခိယဗွီညွO. జనవరి 16న వీరి కాలధర్మం.