Jump to content

పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

s ఆ రోజుల్లో ఇంగ్లీషులో ఆంధ్ర,సంస్కృత కవులనుగురించి వీరు వ్రాసిన వ్యా సాలు పండితమోదం పొందాయి. వీరు ఆంగ్ల విమర్శనారీతులను, పద్ధతులను మేళవించి అనేక వ్యాసాలు వెలువరించి శాశ్వత యశస్సు పొందారు. 'మాధవీ కంకణము', 'రాధారాణి' అనే బెంగాలీనవలలును అనువదించిన వీరు, శైవలినీ చంద్రశేఖరం’, ‘హేలావతి”, “పాంధ స్వప్నము, రవీంద్రుని వినోదిని' లాంటి రచనలెన్నోచేసారు. పత్రికా, సాహిత్యరంగాలలో తణుకును తళక్కుమనిపించారు. 1902-1911సం||ల కాలంలో తణుకులో న్యాయవాదిగా ఉండి, | తణుకు గ్రామపంచాయితీ అధ్యక్షుడిగాకూడా కొనసాగారు. 1912సం||లో తన నివాసం కొవ్వూరుకు మార్చారు. గౌతమి తీరస్థ కొవ్వూరుప్రాంతం పంతులుగారికి కార్యస్థానమైంది. 1912 సం|| లోనే, నేటికీ ఉజ్వలంగా కొనసాగుతున్న 'ఆంధ్ర గీర్వాణ విద్యాలయం నెలకొల్పారు. దీనికి తల్లాప్రగడవారు ఎంతో వ్యయప్రయా సలతో లక్ష రూపాయల ఆస్తిని సంపాదించారు. ఉత్తరభారతంలో మదన్మోహన మాలవ్యా ఏ విధంగా కాశీవిశ్వవిద్యాలయం ఏర్పరచారో, ఆ విధంగా వీరు కొవ్వూరులో ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం నెలకొల్పి, 'ఆంధ్ర మాలవ్య'గా "බීජය పొందారు. తల్లాప్రగడ వారికి అత్యంత ఆత్మీయులు, పరిచయస్తులు అయిన విద్వత్మవి శ్రీకందుకూరి వీరబసవరాజుగారు వీరి 'జీవితచరిత్రములో ఇలా తెలిపారు. మాలవ్యా, రాగూర్ లాంటి గొప్పవారు కోట్లాది రూపాయలు వెచ్చించి, ఉన్నతాదర్శాలతో విద్యాసంస్థలు నెలకొల్పారు. వారు గొప్పగొప్ప భవనాలలో సుఖజీవనంచేస్తూ, ఆయాసంస్థలను నిర్వహించారు. అయితే, తల్లాప్రగడవారిది అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి. తల్లాప్రగడ తన జీవనవృత్తిని విసర్జించి తన భార్యాబిడ్డలను అవస్థలపాలు చేసి, ఆహారం వదిలిపెట్టి, కఠిన నియామాలతో ဒိပဲထဲသံမ္ဘဝ సంపాదించి, జోలెపట్టి బిచ్చమెత్తినట్లు కష్టించి, ఆయూ సంస్థలను పోషించి నిలబెట్టారు. పీఠంకొరకు తమ దేహాభిమానం త్రోసిపుచ్చిన తల్లాప్రగడ వారిపై బసవరాజుగారు, అందుకే కాబోలు, విద్యాపీఠ కార్యము ඩීට්පී ఆధ్యాత్మిక సాధనంగా ఏర్పడిందని వ్రాసారు. తణుకు సమీప కాపవరంలో గ్రంథ భాండాగారము నొకదానిని స్థాపించిన సందర్భంలో, శ్రీ బసవరాజుగారు దాని వార్షికోత్సవసభకు తల్లాప్రగడ వారిని అధ్యక్షులుగా తీసుకు వెళ్ళారట. అప్పడు వారు గంభీరోపన్యాసం చేశారు. విజ్ఞాన సంపాదనకు ఆడంబరాలు, విలాసాలు ముఖ్యంకావని, స్వార్ధత్యాగము, కార్యదీక్ష ప్రధానములని, ఆ కార్యక్రమానికి వెచ్చించిన సొమ్ముతో పుస్తకాలుకొని