జనమంచి వెంకటరామయ్య (1872-1988) డిసెంబరు 2న మహాలక్ష్మి బ్రహ్మావధానులకు జన్మించారు. రాజమండ్రి మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా ఉన్నారు. పండితకవులు. సాంఘిక సమస్యలను ఇతివృత్తాలుగా స్వీకరించారు. అనేక సంస్కృతనాటకాలను అనువ దించారు. 'అమృతభాండము', ‘నాదారితోడు', 'బండిచక్రం', 'నవకుసుమాంజలి, |'ఉత్తరరామచరితము', 'మాలతీమాధవము', "మేఘదూత, సుప్రభాతము', 'గృహ లక్ష్మి, త్రిదశి మొ||వి వీరి రచనలలో కొన్ని సారంగువారు వీరిని తణుకు |పురమున వెలసిన గ్రంథకర్తలలో ఒకరుగా పేర్కొన్నారు. అయితే తణుకుతో ඩීට් సంబంధబాంధవ్యాలు తెలియడంలేదు. ෆඍකීඩ්-ලැඩ් ඩීට් నివాసస్థలం మాత్రమే కావడంతో తణుకు పరిసరప్రాంతాలలో వీరు జన్మించి ఉండవచ్చునని | ఊహ. తణుకుతో వీరి సారస్వతానుబంధాన్ని పెద్దలు నిర్ధారించాలి. జనవరి 19, 1933 సం||లో వీరు మరణించారు. s చాగంటి శేషయ్య (1881-1956) కపిలేశ్వరపురంలో జన్మించారు. సుబ్బమ్మ, కృష్ణయ్యలు తల్లి"/*T |దండ్రులు. ఆంధ్ర, ఆంగ్ల సంస్కృతభాషలలో మంచి ప్రవేశA ముంది. తెలుగు వాజ్మయానికి విశేషమైన సేవలందించారు. |'ఆంధ్ర కవితరంగిణికర్తగా ఆంధ్ర సారస్వతంలో వీరి స్థానం శాశ్వతం. తూIIగోuజిల్లా రామచంద్రపురం తాలూకా వ్య ::: இஜ் ஜீஜீஜ்(ஜ் *ஜ் *నే * శేషయ్యగారు నిడుదవోలుకు చెందిన కొవ్వూరి బసివిరెడ్డి తమ్ముడి కుమారుడైన చంద్రారెడ్డి వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా ఉన్నారు. శేషయ్య, |చంద్రారెడ్డి, తల్లాప్రగడ సూర్యనారాయణరావులను త్రిమూర్తులుగా కొందరు అభివర్ణిస్తారు. ఈ ముగ్గురూ కలసి 'ఆంధ్రప్రచారిణీ గ్రంథనిలయం" అనే సంస్థను స్థాపించారు. తణుకులో స్థాపించబడ్డ ఈ గ్రంథమాల, శేషయ్యగారి అనువాద గ్రంధాలు 'దుర్దేశనందిని', 'విశ్వప్రయత్నం', 'రాధారాణి' లను ప్రచురించింది. శ్రీ శేషయ్యగారు 'ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల ద్వారా పొందిన ప్రోత్సాహం వారిని ఆంధ్రదేశం గర్వించే స్థాయికి చేర్చడంలో ముఖ్యపాత్ర | పోషించిందని చెప్పడం వాస్తవ దూరం కాదు. శేషయ్యగారు పుట్టింది, పెరిగింది తణుకులో కాకపోయినప్పటికీ వారి సారస్వతానుబంధమంతా తణుకుతోనే.
పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/44
స్వరూపం